Begin typing your search above and press return to search.

ఏసీబీ వలకి చిక్కిన మరో పోలీస్ తిమింగలం!

By:  Tupaki Desk   |   23 Sept 2020 3:00 PM IST
ఏసీబీ వలకి చిక్కిన మరో పోలీస్ తిమింగలం!
X
మ‌ల్కాజ్‌ గిరి ఏసీపీ న‌ర్సింహా రెడ్డి నివాసం లో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏక కాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు . గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా న‌ర్సింహారెడ్డి ప‌ని చేశారు. అయితే , ఆయ‌న అనేక భూత‌గాదాల్లో త‌ల‌ దూర్చినట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి. హైద‌రాబాద్ ‌లోని మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌ పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌ లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్ ‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.