Begin typing your search above and press return to search.
టిఫిన్ సెంటర్ లో జీహెచ్ఎంసీ అధికారిణి కక్కుర్తి.. ఏసీబీకి అడ్డంగా దొరికింది
By: Tupaki Desk | 31 May 2021 12:00 PM ISTఅనుకుంటాం కానీ కరోనా చాలానే పాఠాలు నేర్పిందని.. ఇవన్నీ తాత్కాలిక నిజాలే. ఎంత డబ్బున్నా.. మరెంత పలుకుబడి ఉన్నా..కంటికి కనిపించిన ఒక వైరస్ చాలు.. చెట్టంత మనిషి కుప్పకూలేలా చేయటానికి. ప్రాణం పోయేలా చేయటానికి అన్న విషయం తెలిసిన తర్వాత కూడా అడ్డూ ఆపులేని కక్కుర్తిని వదలని వైనం విస్మయానికి గురి చేస్తుంది. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన మహిళా అధికారిణి ఒకరు చేసిన పని తెలిస్తే షాక్ తినాల్సిందే. ఏసీబీకి అడ్డంగా బుక్ అయి తగిన శాస్తి జరిగిందని సంతోషపడటం ఖాయం. ఇంతకూ ఏం జరిగిందంటే?
జీహెచ్ఎంసీలో పని చేసే మహిళా స్వీపర్ సాలెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆమె ఉద్యోగాన్ని.. ఆమె భర్తకు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీలో డీఈగా పని చేసే మహలక్ష్మీ దారుణంగా వ్యవహరించారు. భార్య పోయిన శోకంలో ఉండి.. బతుకుదెరువు కోసం ఉద్యోగాన్ని ఇవ్వమని అడిగితే.. లంచం అడిగారు. ఇందులో భాగంగా రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
అనుకున్నట్లుగా ఒక టిఫిన్ సెంటర్ కు ఈ ఉదయం వచ్చిన మహిళా అధికారిణి చేతికి రూ.20వేలు ఇవ్వటం.. ఆ వెంటనే ఏసీబీ అధికారులు అమెను అదుపులోకి తీసుకోవటం జరిగిపోయాయి. కాప్రా సర్కిల్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం జీహెచ్ఎంసీలో ఇప్పుడు సంచలనంగా మారింది. మానవత్వం లేని రీతిలో వ్యవహరించిన అధికారిణి తీరును పలువురు తప్పు పడుతున్నారు.