Begin typing your search above and press return to search.

ఈఎస్ఐ కేసులో ముగ్గురి అరెస్ట్..మరో ఇద్దరి విచారణ

By:  Tupaki Desk   |   12 Jun 2020 5:30 AM GMT
ఈఎస్ఐ కేసులో ముగ్గురి అరెస్ట్..మరో ఇద్దరి విచారణ
X
ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి టీడీపీ నేత అచ్చెన్నాయుడితోపాటు మరో ఇద్దరిని అధికారికంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరినీ విచారిస్తున్నారు. వీరిని కూడా ఈ సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు విశాఖలో ఏసీబీ అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో కార్మికశాఖలో ఈఎస్ఐ స్కాం జరిగింది. నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిబంధనలకు విరుద్ధంగా మందులు, మెడికల్ వస్తువులు, కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడినట్టు ఏసీబీ తేల్చి అరెస్ట్ చేసింది. 988 కోట్ల కొనుగోలు 150కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ కేసులో అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో అరెస్ట్ చేయగా.. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ లో గతంలో డైరెక్టర్ గా పనిచేసిన డా. సీకే రమేశ్ కుమార్ గారిని తిరుపతిలో అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో డా. విజయ్ కుమార్ ను రాజమండ్రిలో అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ కేసులో నాడు ఇన్ వాల్వ్ అయిన జాయింట్ డైరెక్టర్ జనర్ధాన్, ఈఎస్ఐ అసిస్టెంట్ గా పనిచేసిన ఎంకేవీ చక్రవర్తి లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

అచ్చెన్నాయుడు, డా. సీకే రమేశ్ కుమార్, డా. విజయ్ కుమార్ ముగ్గురిని ఏసీబీ స్పెషల్ కోర్టులో జడ్జి ముందు ఈరోజు హాజరు పరిచారు.