Begin typing your search above and press return to search.

పాక్ దొంగ బుద్ధి మార‌దా? కూలిన పాక్ మిగ్ లెక్క చెప్ప‌దే!

By:  Tupaki Desk   |   28 Feb 2019 8:20 AM GMT
పాక్ దొంగ బుద్ధి మార‌దా? కూలిన పాక్ మిగ్ లెక్క చెప్ప‌దే!
X
భార‌త్ కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చేశామ‌ని చెప్పుకున్న పాక్.. అదే స‌మ‌యంలో త‌మ‌కు చెందిన ఒక మిగ్ కూలిపోయింద‌న్న విష‌యాన్ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. భార‌త్ కు చెందిన యుద్ధ విమానాలు కూలిన విష‌యాలు భార‌త్ ఒప్పుకుంది. అదే స‌మ‌యంలో భార‌త్ కు చెందిన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌న్ పాక్ చెర‌లో ఉండ‌టం.. అత‌న్ని జెనీవా ఒప్పందం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని కోరింది. అత‌డికి ఎలాంటి హాని త‌ల‌పెట్టొద్ద‌ని పేర్కొంది.

కానీ.. పాకిస్థాన్ మాత్రం త‌మ‌కు చెందిన కూలిన యుద్ధ విమానం లెక్క‌ను ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. అంతేకాదు.. ఆ యుద్ధ విమానంలోని పైలెట్ గురించిన సమాచారాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. వాస్త‌వానికి పాక్ లో కూలిన ఆ దేశ యుద్ధ విమానాన్ని కూల్చింది మ‌రెవ‌రో కాదు.. ప్ర‌స్తుతం పాక్ చెర‌లో ఉన్న అభినంద‌న్ వ‌ర్ద‌న్‌. భార‌త సైన్యానికి చెందిన ఆయుధగారంపై బాంబులు వేసేందుకు ప్ర‌య‌త్నించిన మిగ్ ను త‌రిమిన అభినంద‌న్.. దాన్ని కూల్చే క్ర‌మంలో పొర‌పాటున పాక్ భూభాగంలోకి ప్ర‌వేశించారు. తాను అనుకున్న ప‌నిని పూర్తి చేశాడు. పాక్ కు చెందిన మిగ్ ను కూల్చేశాడు.

అదే స‌మ‌యంలో త‌న విమానాన్ని పాక్ ద‌ళాలు కూల్చాయి. అయితే.. కూలిన విమానం నుంచి ప్యారాచూట్ సాయంలో క్షేమంగా కింద‌కు దిగాడు. కానీ.. అది ఎల్ వోసీకి ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పాక్ ప్రాంతం కావ‌టంతో ఆయ‌న అక్క‌డ చిక్కుకుపోవాల్సి వ‌చ్చింది. దీని త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌న్ని తెలిసిన‌వే.

భార‌త్ చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చిన‌ట్లు.. భార‌త వింగ్ క‌మాండ‌ర్ ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించిన పాక్..అందుకు సంబంధించిన వీడియోల్ని విడుద‌ల చేసింది కానీ త‌మ‌కుచెందిన మిగ్ కూలిపోయిన వైనాన్ని మాత్రం వెల్ల‌డించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా పాక్ కు చెందిన డాన్ ప‌త్రిక సైతం అభినంద‌న్ ను పాక్ ద‌ళాలు ప‌ట్టుకున్న వైనాన్ని ఫోన్లో చెప్పిన వ్య‌క్తి.. రెండు యుద్ధ విమానాలు కూలిన‌ట్లు చూసిన‌ట్లు చెప్పారు. ఒక‌టి భార‌త్ ది అయితే.. రెండోది ఎవ‌రిద‌న్న విష‌యంపైనా క్లారిటీ లేదు. కానీ.. ఆ కూలిన రెండో విమానం పాక్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న పైల‌ట్ సంగ‌తి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

భార‌త్ కు చెందిన విమాన శ‌క‌లాలంటూ పాక్ విడుద‌ల చేసిన ఫోటోల్లో పాక్ కు చెందిన ఎఫ్ 16 శ‌క‌లంగా నిపుణులు గుర్తించారు. అంతేకాదు.. ఆ చిత్రంలో పాక్ 7 నార్త‌ర్న్ లైట్ ఇన్ ఫ్యాంట్రీ క‌మాండింగ్ ఆఫీస‌ర్ చిత్రం కూడా ఉంది. కానీ.. ఈ విష‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ పాక్ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇలా త‌న సైన్యం త‌ర‌ఫు వారు మ‌ర‌ణించినా.. మిస్ అయినా వారి విష‌యాల్ని బ‌య‌ట‌కు చెప్ప‌కుండా దాచి పెట్టటం పాక్ కు మొద‌ట్నించి అల‌వాటే. దాన్ని ఈసారి కొన‌సాగించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.