Begin typing your search above and press return to search.

కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ .. పాక్ ఏంచెప్పిందంటే ?

By:  Tupaki Desk   |   11 Nov 2019 7:56 AM GMT
కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ .. పాక్ ఏంచెప్పిందంటే ?
X
వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్. ఈయన గురించి ప్రత్యేకం గా పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. బాలాకోట్‌ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్‌ యుద్ధ విమానాలను తరుముకుంటూ మిగ్-21 విమానంలో వెళ్లిన అభినందన్. పొరపాటున పాక్ గగన తలం లోకి ప్రవేశించ గా..ఆ విమానాన్ని పాక్ దళాలు కూల్చి వేశాయి. దీనితో అందరూ మొదట అభి నందన్ చనిపోయాడని అనుకున్నా.. అతన్ని బంధీ గా పట్టుకున్నాయి. ఆ తరువాత ఇన్ని ఇబ్బందులు పెట్టి నప్పటికీ అభినందన్ మాత్రం ఇండియన్ గుట్టు వారి ముందు విప్పలేదు. అప్పట్లో అభినందన్ ని చిత్ర హింసలు పెడుతూ.. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీనిపై.. ప్రపంచ వ్యాప్తం గా పెద్ద చర్చ జరగడం, వివిధ దేశాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువ గా రావడం తో నాలుగురోజుల తరువాత అతన్ని ఇండియాకు అప్పగించారు పాక్ సైనికులు.

ఈ ఘటన జరిగి చాలా రోజులు కావొస్తుంది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా .. మళ్ళీ ఈయన ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. పాకిస్థాన్ లోకి కరాచీ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం లో అభి నందన్ బొమ్మ పెట్టారు. అసలు అభి నందన్ బొమ్మ ని ఎందకు పెట్టారో తెలియదు. కానీ , కరాచీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న అభి నందన్ బొమ్మ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పాకిస్తాన్ జర్నలిస్టు అన్వర్‌ లోధి శని వారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ద్వారా కరాచీ మ్యూజియం లోని అభి నందన్ బొమ్మ ఫొటోను షేర్ చేశారు. అయన అభి నందన్ ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ... అతని చేతి లో టీ కప్పు కూడా పెడితే ఇంకా బాగుండేదని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయం లో పాక్ అభినందన్‌ బొమ్మ పెట్టడం గమనార్హం.