Begin typing your search above and press return to search.

క్లబ్ డ్యాన్సర్ తో చిందేసి చిక్కుల్లో పడ్డాడు

By:  Tupaki Desk   |   30 Sept 2015 4:44 PM IST


ఎన్నికల వేళ సిత్ర.. విచిత్రాలు మామూలే. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అంట్లు తోమటం.. బట్టలు ఉతకటం.. ఇస్త్రీ చేయటం.. ఇలా ఒకటి కాదు.. చాలానే పనులు చేసి ఓటరు మా రాజుల మనసుల్ని దోచుకునేందుకు చాలా చేస్తుంటారు.

అయితే.. ఎవరూ చేయలేని పని చేసి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు జేడీయూ అభ్యర్థి. ఎన్నికలు ముంగిట్లో వచ్చిన వేళ.. నిత్యం ప్రజల చుట్టూ తిరుగుతూ కిందా మీదా హైరాన పడిపోయే నేతలకు భిన్నంగా.. ఈ జేడీయూ నేత ఓ క్లబ్ డ్యాన్సర్ తో ఐటెం సాంగ్ డ్యాన్స్ చేసి వీడియోకి దొరికిపోయారు.

ఓ కార్యక్రమానికి వెళ్లిన జేడీయూ నేత అభయ్ కుశ్వాహ.. అక్కడ డ్యాన్స్ వేస్తున్న డ్యాన్సర్ తో కలిసి చిందులేశారు. ఈయన గారి ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన ఒకరు ఈ మొత్తాన్ని వీడియో తీసి.. సోషల్ నెట్ వర్క్ లోకి అప్ లోడ్ చేశారు. దీంతో.. అయ్యగారి డ్యాన్స్ యవ్వారం లోకానికి తెలిసిపోయింది. ఎన్నికల వేళ.. జేడీయూ అభ్యర్థిగా ఉన్న ఇతగాడి తీరుపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.