Begin typing your search above and press return to search.

అబ్దుల్ కాలం ఓ జిహాదీ .. ఎవరన్నారంటే ?

By:  Tupaki Desk   |   24 March 2021 6:32 AM GMT
అబ్దుల్ కాలం ఓ జిహాదీ .. ఎవరన్నారంటే ?
X
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా .. ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి . డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం.లలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో క్షిపణులు ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లాయి.

జులై 1992 నుంచి డిసెంబర్ 1999 వరకు ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం.. ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు. పదవీకాలం ముగిసిన అనంతరం విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు. దేశ, విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. 2015 జులై 27 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఐఐఎం విద్యార్థులకు పాఠం చెబుతూ కుప్పకూలిపోయారు.

ఇదిలా ఉంటే .. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఓ పూజారి. దివంగ‌త మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. క‌లాం ఓ జిహాదీ అంటూ వెల్లడించారు. దేశంలో అత్యున్న‌త స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవ‌రూ ఇండియాకు అనుకూలంగా ఉండ‌ర‌ని, క‌లాం ఓ జిహాదీ అని అన్నారు. అలీఘ‌డ్‌ లోని ద‌స్నాదేవి ఆల‌య పూజారి య‌తి న‌ర్సింగానంద స‌ర‌స్వ‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు. డీఆర్ ‌డీవో చీఫ్ ‌గా ఉన్న స‌మ‌యంలో క‌లాం.. పాకిస్థాన్ ‌కు అణు బాంబు ఫార్ములాను స‌ప్ల‌య్ చేసిన‌ట్లు ఆరోపణలు చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో ఉన్న స‌మ‌యంలో క‌లాం ప్ర‌త్యేక సెల్‌ ను ఏర్పాటు చేశార‌ని, అక్క‌డ ముస్లింలు మాత్ర‌మే ఫిర్యాదు చేయ‌వచ్చు అన్నారు. ఇటీవ‌ల ఘ‌జియాబాద్ ఆల‌య ప్రాంగ‌ణంలో ఓ ముస్లిం కుర్రాడు నీళ్లు తాగిన ఘ‌ట‌నపై స్పందిస్తూ ఆ పూజారి ఈ కామెంట్స్ చేశారు. కలాం ఒక్కడే కాదు, ఇండియాలో అత్యున్నత పదవులు పొందిన ముస్లింలు అందరూ దేశ వ్యతిరేకులే అని పూజారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం రేపుతున్నాయి.