Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు.. ఒకరి మృతి

By:  Tupaki Desk   |   12 Feb 2020 10:15 AM IST
బ్రేకింగ్: ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు.. ఒకరి మృతి
X
ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆనందం ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీలో వెల్లివిరుస్తోంది. కేజ్రీవాల్ సహా గెలిచిన ఆప్ ఎమ్మెల్యేలంతా సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకుంటున్న సమయం.. ఊరు వాడా అంతా ఆప్ కార్యకర్తలు, నేతలతో ఆహ్లాదంగా గడిచిపోయిన సమయం. అంతలోనే పెద్ద ఉపద్రవం ఆప్ కు వచ్చిపడింది..

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు కలకలం రేపాయి. ఎన్నికల్లో గెలిచి విజయోత్సాహం లో ఉన్న నరేష్ యాదవ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే నరేష్ పక్కనే ఉన్న అశోక్ మాన్ అనే ఆప్ కార్యకర్త మృతిచెందారు. మరో కార్యకర్త తీవ్రంగా గాయ పడ్డారు.

కాగా ఆప్ గెలుపును జీర్ణించుకోలేకనే ప్రత్యర్థులే తనను చంపాలని చూశారని.. ఈ కాల్పుల్లో తమ కార్యకర్తలు అసువులు బాసారని ఎమ్మెల్యే అశోక్ వాపోయారు. తన కాన్వాయ్ పై కాల్పులకు దిగిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే నరేష్ డిమాండ్ చేశారు. సీసీఫుటేజీ పరిశీలించి ఆగంతుకులను పోలీసులు గుర్తించాలని అరెస్ట్ చేయాలని కోరారు.