Begin typing your search above and press return to search.

భార్యను చంపబోయిన ఆప్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 Sept 2015 12:10 PM IST
భార్యను చంపబోయిన ఆప్ ఎమ్మెల్యే
X
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ భారతి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. భార్యను హతమార్చేందుకు ప్రయత్నించిన కేసులో ఆయన తప్పు చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. సోమనాథ్ భారతి మీద నమోదు చేసిన కేసు వివరాలను ఢిల్లీ హై కోర్టుకు సమర్పించారు. సోమనాథ భారతి రెండు సార్లు ఆయన భార్యను హత్య చెయ్యడానికి ప్లాన్ వేశారని పోలీసులు కోర్టులో చెప్పారు.

సోమనాథ్ భారతి భార్య లిపిక తనను భర్త వేధించాడని.. రెండుసార్లు హత్యచేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని హై కోర్టుకు వివరించారు. లిపిక గర్బవతిగా ఉన్న సమయంలో హత్య చెయ్యడానికి సోమనాథ్ మొదటి సారి ప్రయత్నించారని, తరువాత ఆమె మణికట్టును చీల్చి హత్య చెయ్యడానికి రెండోసారి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. సోమనాథ్ భారతి ఆయన పెంచుకున్న కుక్కను తనపై ఉసిగొల్పి దాడి చేయించారని కూడా లిపిక ఆరోపిస్తున్నారు. మొత్తానికి కోర్టు ఆయన అరెస్టుకు ఇంకా అనుమతి ఇవ్వకపోయినా ఆధారాలు బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతుండడంతో సోమనాథ్ భారతి ఇరకాటంలో పడినట్లే అనిపిస్తోంది.