Begin typing your search above and press return to search.

షాకిచ్చేలా ‘సామాన్య’ మంత్రి రాసలీల సీడీ

By:  Tupaki Desk   |   1 Sept 2016 11:09 AM IST
షాకిచ్చేలా ‘సామాన్య’ మంత్రి రాసలీల సీడీ
X
మాటలు చెప్పే నేతలకు.. చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే విప్పి చెప్పే ఉదంతమిది. రాజకీయాల్ని ప్రక్షాళన చేయటంతోపాటు.. సరికొత్త రాజకీయాన్ని దేశ ప్రజలకు పరిచయం చేస్తామంటూ గొప్పలు చెప్పే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడీ సంచలనంలో మరో మంత్రి చేరారు. అయ్యగారి చేష్టల్ని సీడీలో చూసినోళ్లంతా షాక్ తింటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 36 ఏళ్ల సందీప్ కుమార్ కు చెందిన రాసలీలల సీడీ ఒకటి తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చేరింది.

ఈ సీడీతోపాటు.. అయ్యగారి రాసలీలకు సంబంధించిన పదకొండు ఫోటోలు కూడా వాటితో అటాచ్ చేసి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇద్దరు మహిళలతో అభ్యంతరకర స్థితిలో ఉన్న మంత్రిగారి లీలలు చూసిన సీఎం కేజ్రీవాల్ ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోఇదే మంత్రిగారు భారీ స్పీచ్ ఇస్తూ.. ‘మహిళల్ని గౌరవించనివాడు మనిషే కాదు’’ అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారు. అలాంటి వ్యక్తి భార్య కాని ఇద్దరు మహిళలతో రాసలీలలు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు.

గత ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో సందీప్ కుమార్ ఒకరు. సుల్తాన్ పూర్ మజ్రా నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జై కిషన్ ను 64,439 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేజ్రీవాల్ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న సందీప్ కుమార్ తాజాగా తీవ్ర అవమానభారంతో పదవిని పోగొట్టుకున్న దుస్థితి.

తన మంత్రివర్గంలోని సభ్యుడైన సందీప్ కుమార్ కు చెందిన అభ్యంతరకర సీడీ తనకు ఇప్పుడే అందిందని.. ప్రజాజీవితంలోమర్యాదకు అప్ కట్టుబడి ఉందని.. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిన ఆయన.. మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి తక్షణమే తొలిగిస్తున్నట్లుగా సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వృత్తి రీత్యా లాయర్ అయిన సందీప్.. తాను అడ్డంగా బుక్అయిన తాజా ఘటనపై ఎలా రియాక్ట్ అవుతారో..?