Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సమావేశాల్లో ఎర్రన్నాయుడు కూతురు షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   18 Nov 2021 1:03 PM GMT
అసెంబ్లీ సమావేశాల్లో ఎర్రన్నాయుడు కూతురు షాకింగ్ కామెంట్స్
X
ఏపీ అసెబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ ప్రసంగాలను వినిపించారు. అధికార పక్ష నాయకులు ప్రభుత్వం చేసే పనుల గురించి చెబుతుండగా.. విపక్షాలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని దిశా చట్టంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్యులు వైసీపీ పాలనలో చితికిపోతున్నారని చితికిపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించిన సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అంతకుముందు వివిధ కారణాలతో మరణించిన అజీజ, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి, రంగనాయకులు, టి వెంకయ్య మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో 14 అర్డినెన్స్ లను ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. ముఖ్యంగా మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలి సభల్లో చర్చించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీలో అసెంబ్లీ సమావేశాల ఎజెండా, పనిదినాలపై చర్చించారు. అయితే ఒక్కరోజు మాత్రమే నిర్వహించారని తెలియగానే కనీసం 15రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

మహిళా సాధికారతపై జరిగిన చర్చలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని దిశా చట్టంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టం పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఇది ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. మహిళల లైంగిక వేధింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. సీతానగరంలో జరిగిన గ్యాంగ్ రేపు సంఘటనలో నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అసలు దిశా చట్టం కింద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ప్రభుత్వం ప్రజలకు చెప్పలేదన్నారు. ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో నేను దిశా చట్టం రావాలని సభలో కోరారు. కానీ నాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తరువాత దిశ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోవడం లేదు. ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఇక మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ షాపుల నుంచి అధిక ఆదాయం పొందుతూ వాటిన రక్షిస్తుందని ఆరోపించారు. ఇక తన నియోజకవర్గంలో కొందరు పింఛన్లు కోల్పోయామని కొందరు వృద్ధులు తనను అడిగారని, వారికి న్యాయం చేయాలన్నారు.

ఇక సమావేశాల ప్రారంభలో టీడీపీ నిరసనతో ప్రసంగాన్ని మొదలు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలు బ్యానర్ పట్టుకొని అసెంబ్లీ వరకు వచ్చారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించిందని, రాష్ట్రం కూడా పెట్రోల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఇక సమావేశాల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కు ఇవ్వగా దానిని ఆయన తిరస్కరించారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. టీడీపీ నవంబర్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరగా అందుకు స్పీకర్ అంగీకరించారు. దీంతో 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.