Begin typing your search above and press return to search.

జైల్లో ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన యువతి.. ప్రాణం పోయింది

By:  Tupaki Desk   |   20 Aug 2022 11:30 PM GMT
జైల్లో ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన యువతి.. ప్రాణం పోయింది
X
కొన్ని సందర్భాలు ఎలా జరుగుతాయో.? ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. కానీ అలా జరిగిపోతాయి.. దానికి అర్థాలు.. పెడర్థాలు తీయలేదు. అది వాళ్లకు శాపంగా పరిగణించాల్సిందే. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని చూడడానికి వచ్చిన ఓ యువతి  అతడికి లిప్ కిస్ పెట్టింది. కిస్ చేశాక ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయింది. కానీ కాసేపటికే ఆ ఖైదీ చనిపోయాడు. ఆ చనిపోయిన ఖైదీ ఆమెకు ప్రియుడు అని తర్వాత తేలింది.

ప్రియుడికి ఆమె ముద్దు పెట్టిన కాసేపటికే అతడు ఎందుకు చనిపోయాడన్నది జైలు అధికారులకు కూడా అర్థం కాలేదు. అమెరికాలోని టేనస్సీలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

ఈ ఫిబ్రవరి 19వ తేదీన రాచెల్ డోలార్డ్ అనే యువతి డ్రగ్స్ కేసులో టేనస్సీ జైలులో 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు జాషూ బ్రౌన్ ను కలవడానికి జైలుకు వెళ్లింది.  జాషూతో చాలాసేపు మాట్లాడింది. సమయం అయిపోవడంతో తిరిగి వెళ్లిపోతూ ప్రియుడు జాషూకు లిప్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె క్యాజువల్ గా వెళ్లిపోయింది. ఆ తర్వాత అసలు విషయం ఏంటని ఆరాతీసింది.

రాచెల్ వెళ్లిపోయిన కాసేపటికి ప్రియుడు జాషూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన జైలు సెంట్రీలు అధికారులకు విషయం చెప్పారు. వారు వెంటనే జాషూని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు చనిపోయాడు.

అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగానే ఉన్న జాసూ తన ప్రియురాలు ముద్దు పెట్టిన కాసేపటికే ఎలా చనిపోయాడన్నది పోలీసులు ఆరాతీస్తున్నారు. దీంటో భాగంగా జైల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అంతా షాక్ అయ్యారు.

రాచెల్ .. తన బాయ్ ఫ్రెండ్ కు లిప్ కిస్ ఇచ్చినప్పుడు ఆమె నోటి నుంచి 0.5 ఔన్స్ మెథాంఫెటామైన్ అనే డ్రగ్ నుంచి జాషూ నోట్లోకి వెళ్లేలా చేసింది. దాన్ని అతడు ఎవరికీ తెలియకుండా బాత్రూమ్ కు వెళ్లి బయటకు తీసుకొని వేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈలోపే తొందరపాటులో మింగేశాడు. దీంతో డ్రగ్ ఓవర్ డోస్ అయ్యి.. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు.

దీంతో పోలీసులు ప్రియురాలు రాచెల్ పై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్  చేశారు. ఆమె ఇలా ఎందుకు చేసిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.