Begin typing your search above and press return to search.
పెళ్లి కోసం హిందువుగా మారిన ముస్లిం యువకుడు!
By: Tupaki Desk | 2 Dec 2020 10:51 AM ISTలవ్ జిహాద్ లో ఎప్పుడూ జరిగేదానికి భిన్నంగా జరిగింది. ఓ ముస్లిం యువకుడు హిందూ అమ్మాయి కోసం మతం మారడం సంచలనమైంది. హర్యానా రాష్ట్రంలో 19 ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21 ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఈ వివాదం మత ప్రాతిపదికన జరగడంతో ప్రస్తుతం నూతన వధూవరులకు హర్యానా పోలీసుల రక్షణ కల్పిస్తున్నారు. యువతి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, వ్యక్తిగత స్వేచ్ఛకు హాని ఉందని పేర్కొంటూ ఈ జంట పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుని ఆశ్రయించారు. తమ వివాహాన్ని వ్యతిరేకించడం..రాజ్యాంగంలోని ఆర్టికల్-21కింద తమకు కల్పించబడిన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఈ జంట పేర్కొంది. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జంటకి హర్యానా పోలీసులు రక్షణ కల్పించారు.
వివాహం తర్వాత ప్రస్తుతం ఈ జంటని పోలీసు ప్రొటెక్షన్ లో ఉంచారు పోలీసులు. యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కలిశారు. చట్టబద్దంగా జరిగిన వారి వివాహాన్ని అంగీకరించాల్సిందిగా యువతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. నూతన వధూవరులు తమకు ఇష్టం వచ్చినట్లు జీవించేలా అనుమతించాలని యువతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే యువతి కుటుంబసభ్యులు మాత్రం కలిసేందుకు నిరాకరించారు. ఇప్పటికే దేశంలో ‘లవ్ జిహాద్’ణు వ్యతిరేకిస్తూ యూపీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉన్న వీరి పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎలా ముందుకెళుతారన్నది ఆసక్తిగా మారింది.