Begin typing your search above and press return to search.

నంబర్ ప్లేట్ కి మాస్క్ తగిలించి యువకుడు..

By:  Tupaki Desk   |   10 Dec 2021 12:30 AM GMT
నంబర్ ప్లేట్ కి మాస్క్ తగిలించి యువకుడు..
X
హైదరాబాదులో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. కేవలం రాత్రిపూట మాత్రమే కొంచెం ఖాళీగా కనిపిస్తాయి. పెరుగుతున్న నగరంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా అంతకంతకూ పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే చాలా మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘన చేస్తున్నారు. వీరిపై తెలంగాణ పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వారిపై ఫైన్ ల రూపంలో విరుచుకు పడుతున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది వాహనదారుల ఇప్పటికీ నిబంధనలను పట్టించుకోవడం లేదు. కారులో పోయే వాళ్లు సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మరికొందరు హెల్మెట్ పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఇలాంటి వారిపై దృష్టి సారించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలను ఇప్పటికే తీస్తున్న పోలీసులు వారి నంబర్ ప్లేట్ ఆధారంగా వారికి చలానాలు విధిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని కొంతమంది వింత వింత చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దానిలో ఓ ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. అది ఏంటంటే.. ఓ వాహనదారుడు నోటికి పెట్టుకోవాల్సిన మాస్క్ ను ఏకంగా బండి నంబర్ ప్లేట్ కు తగిలించాడు. అంతే కాకుండా బండి మీద పోయేటప్పుడు పెట్టుకోవాల్సిన హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ట్రాఫిక్ పోలీస్ తీసే ఫొటోకు పోజు ఇచ్చాడు.

మరో యువతి కూడా సేమ్ ఇలానే చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పోలీసులు ఎక్కడ ఫోటో తీస్తారో అనే భయంతో తన స్కూటీకి వెనక పక్కన ఉండే నంబర్ ప్లేట్ కి ఒక స్టిక్కర్ ను తగిలించింది. ఇలా ఒకరు మాస్క్ ని తగిలిస్తే... మరొకరు స్టిక్కర్ ని తగిలించారు. ఈ ఫోటోలను పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇలా నిబంధనలను తుంగలో తొక్కిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో విజ్ఞులైన ప్రజలే చెప్పాలి అంటూ క్యాప్షన్ పెట్టారు. వీరంతా కొత్త వేరియంట్ కు సంబంధించిన రోగులని చమత్కరించారు. అంతేకాకుండా వీరిపై కచ్చితంగా ఇండియన్ క్రిమినల్ కోడ్ ప్రకారం శిక్షించాలని అన్నారు.

ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా పోలీసులు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసి పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఇలాంటి కేటుగాళ్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మనుషులు మాస్కు లేకపోతే క్వరెంటైన్ లోకి పోతారో లేదో కానీ.. ఇలా బండి నెంబర్ ప్లేట్ కు మార్కులు వస్తే మాత్రం... వారి బండి కచ్చితంగా పోలీసుల క్వారంటైన్ కేంద్రానికి పోవడం మాత్రం పక్క అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ల కోసం సిగ్నల్స్ వద్ద వేచి చూస్తున్నట్లు తెలిపారు. వాడు దొరికితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

కరోనా వచ్చిన తర్వాత మాస్కుల వినియోగం చాలా ఎక్కువ అయింది. ఇవి లేకుండా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొంతమంది ఘనులు పోలీసుల మాట లెక్క చేయడం లేదు.