Begin typing your search above and press return to search.

నిద్ర పోతూ రూ.10 లక్షలు సంపాదించే అద్భుత అవకాశం

By:  Tupaki Desk   |   26 Feb 2021 8:00 AM IST
నిద్ర పోతూ రూ.10 లక్షలు సంపాదించే అద్భుత అవకాశం
X
హంసతూలికాతల్పం అన్నంత కాకున్నా.. చక్కటి బెడ్ మీద పడుకున్న తర్వాత కూడా ఏ మాత్రం నిద్రపట్టని వారెందరో. కానీ.. అందుకు భిన్నంగా పక్కనేం జరుగుతున్నా పట్టించుకోకుండా హాయిగా నిద్రపోయే వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారిని చూసి కొందరు ఆసూయ పడితే.. మరికొందరు ఏం లక్కీరా బాబు అంటూ పొగిడేస్తుంటారు. నిద్ర తప్పించి ఇంకేం చేయలేరు.. ఎందుకు పనికి వస్తుంది ఈ దరిద్రపు నిద్ర అంటూ తిట్టిపోసే వారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు.
అయితే.. మారిన కాలానికి తగ్గట్లు తాజాగా ఒక పెద్ద సవాల్ ను విసురుతోంది ఒక సంస్థ. హాయిగా నిద్రపోతే చాలు రూ.10లక్షల బహుమతి మీ సొంతమని చెబుతోంది. అయితే.. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అయినా.. నిద్రపోతే రూ.10లక్షలు బహుమతి ఎలా ఇస్తారన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.

వేక్ ఫిట్ వారు 2021-22 స్లీప్ ఇంటర్న్ షిప్ లో పాల్గొనాలి. ఇందులో భాగంగా100 రోజుల పాటు రోజు తొమ్మిది గంటల పాటు హాయిగా నిద్రపోతే రూ.10లక్షలు మీ సొంతమవుతాయి. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిద్రపోవటం తప్పనిసరి. అయితే.. ఇందులోపాల్గొనటానికి ముందు https://wakefit.co/sleepintern/ వెబ్ సైట్ ను ముందుగా సందర్శించాలి. అందులోని నియమనిబంధనల్ని పక్కాగా చదువుకున్న తర్వాత.. ఇందులో అప్లై చేస్తే.. వారు అర్హుల్ని ఎంపిక చేసి.. వంద రోజుల ఇంటర్న్ షిప్ కు అర్హుల్ని చేస్తారు. ఇలా ఎంపికైన ప్రతి ఒక్కరికి లక్షరూపాయిల్ని ఇస్తారు. ఈ పోటీలో చివరగా విజేతగా నిలిచిన వారికి అదనంగా రూ.10లక్షలు బహుమతిగా ఇస్తారు. ఈ ఆఫర్ ఊరిస్తోందా? ముందు.. రూల్స్ జాగ్రత్తగా చదివిన తర్వాత కలలు కంటే బాగుంటుంది సుమా.