Begin typing your search above and press return to search.

ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు..!

By:  Tupaki Desk   |   8 April 2021 7:00 AM IST
ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు..!
X
మనుషులకు కష్టాలు రకరకాలు. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు . మరికొంతమందికి వ్యాధులతో వచ్చే చికాకులు. కొన్ని వ్యాధులు వైద్యుల అంచనాలకు కూడా అందవు. అటువంటి వింత వ్యాధితో బాధపడుతోంది ఓ మహిళ. ఆమె మంచం మీదే 24 గంటలు కదలకుండా ఉండాల్సిందే. కదిలితే చనిపోతుంది. కేవలం కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా మాత్రమే ఆమెకు ద్రవ పదార్థాలు అందజేస్తున్నారు. ఇది ఓ అరుదైన జబ్బు అని డాక్టర్లు అంటున్నారు. దీంతో ఆమె ఆస్పత్రిలోనే క్షణమొక యుగంగా గడుపుతున్నది. నిత్య నరకం అనుభవిస్తున్నది. అనుక్షణం చుక్కలు చూస్తున్నది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని అంటున్నారు చూసిన వాళ్లంతా..

నెదర్లాండ్ దేశంలోని డ్రాన్‌టెన్‌ కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్‌ వాస్‌ వీనస్ అనే యువతికి ఓ వింత జబ్బు సోకింది. కదిలితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఈ వ్యాధి పేరు ఎహ్లర్స్​ డాన్లోస్​ సిండ్రోమ్​ ( ఈడీఎస్​) అంటారని వైద్యులు అంటున్నారు.

ఇది చాలా అరుదైన వ్యాధి.. శరీరంలోని చర్మం, ఎముకలు, రక్తనాళాలు అవయవాలకు సంబంధించిన కణజాలాలపై ఈ వ్యాధి ప్రభావం చూపిస్తుంది. వీనస్​ దాదాపు 22 గంటలు మంచం మీద అలాగే పడుకొని ఉండాల్సిందే. ఆమె వెన్నెముక ఇతర కండరాలు, ఎముకలు పనిచేయవు. ఓ జీవచ్చవంలా ఆమె బతుకున్నది. ఈ అరుదైన వ్యాధికి ఎటువంటి చికిత్స చేయాలో కూడా వైద్యులకు అర్థం కావడం లేదు.

విషయం తెలుసుకున్న స్పెయిన్​లోని బార్సినాలోని వైద్యులు ముందుకొచ్చారు. ఆమెకు ఓ అరుదైన సర్జీరీ చేయాలని అది ఎంతో ఖరీదైంది అని వాళ్లు అంటున్నారు. ఈ ఆపరేషన్​ డబ్బుల కోసం ఫండింగ్​కు ట్రై చేస్తున్నామని చెబుతున్నారు. ఆ ఆపరేషన్​ జరిగితే ఆమె కోలుకొనే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ వింత జబ్బు గురించి విన్న వారంతా, ఆ యువతి పడే బాధ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు.