Begin typing your search above and press return to search.

దేశాధ్యక్షుడి చెంప మళ్లీ చెల్లు.. కొట్టింది సాధారణ మహిళ

By:  Tupaki Desk   |   27 Nov 2022 7:34 AM GMT
దేశాధ్యక్షుడి చెంప మళ్లీ చెల్లు.. కొట్టింది సాధారణ మహిళ
X
భారీగా శత్రువులుండే అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రక్షణగా ఉంటారు. వారు దేశానికి అయినా పర్యటనకు వెళ్లాల్సి ఉంటే అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించి ఓకే చెప్పాల్సిందే. ఇక రష్యా అధ్యక్షుడికి ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే ఉంటాయి. విదేశాల్లో అధ్యక్షుడి స్థాయికి మన దేశంలో సమానమైన ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) రక్షణ కవచంలా ఉంటుంది. కానీ, యూరప్ దేశాల్లో అలా కాదు. అక్కడి దేశాల అధ్యక్షులు, ప్రధానులు సాధారణ ప్రజల్లో కలిసిపోతుంటారు. కెనడాలోనూ ప్రధాని సాధారణ స్థాయి వ్యక్తిగా ఉంటారు. శాంతికాముక దేశాలు కావడంతో వాటిఅధినేతలకు పెద్దగా ప్రాణ హాని ఉండదు. అయితే, ఇలాంటి సందర్భాన్ని ఆసరాగా తీసుకుని కొందరు తమ నిరసనను వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయ్యేల్ మేక్రన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అనూహ్యంగా ఆయన చెంప చెల్లుమంది.

అనూహ్యంగా ఎదురుపడి

మేక్రన్ ఏదో పర్యటనకు బయల్దేరగా.. ఓ మహిళ ఆయనకు అనూహ్యంగా ఎదురుపడింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఆయన చెంప మీద కొట్టింది. ఈ అనూహ్య పరిణామంతో మేక్రన్ భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. వారు తేరుకునేలోగానే జరగాల్సింది జరిగింది. అనంతరం మేక్రన్ చెంపను పగులగొట్టిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవసాగింది. కాగా, ఆ మహిళ ఆలివ్ గ్రీన్ షర్టు ధరించి ఉంది. ఘటన జరిగిన వెంటనే ఆమెను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ అనూహ్య పరాభవంతో మేక్రన్ కూడా కంగుతిన్నట్లు వీడియోలో ఆయన హావభావాలను చూస్తే తెలుస్తోంది.

ఇది రెండోసారి.. ఈసారి ఎక్కడ జరిగిందో?

మేక్రన్ చెంపపై ఓ మహిళ కొట్టని సంఘటన ఫ్రాన్స్ లో ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఎప్పుడు జరిగిందో కూడా తేలలేదు. సాక్షాత్తు అధ్యక్షుడిపై దాడి చేయడానికి కారణాలు ఏమిటనే వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతేడాది జూన్‌ 8న సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ చెక్‌ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు మేక్రాన్‌ కారు వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో అధ్యక్షుడిని చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. దీంతో మేక్రాన్ బారికేడ్ల దగ్గరికెళ్లి వారితో కరచానలాలు చేశారు. ఆ సమయంలో ఓ యువకుడు అధ్యక్షుడికి షేక్ హ్యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప పగలగొట్టాడు. అనూహ్య సంఘటనతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులు సదరు యువకుడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆ యువకుడు మేక్రాన్ అతివాద ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.

ఫ్రాన్స్ చిన్నదేం కాదు..

ఫ్రాన్స్ అంతర్జాతీయంగా పేరున్న దేశం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యురాలు. పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందున్న దేశం. ఆ దేశాధ్యక్షుడికి ప్రపంచ వ్యప్తంగానూ ప్రాధాన్యం ఉంటుంది. నాటో కూటమిలో ఫ్రాన్స్ కీలకం. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ వివిధ అంశాలపై ఫ్రాన్స్ చురుగ్గా వ్యవహరిస్తుంది. అలాంటి దేశానికి చెందిన అధ్యక్షుడికి వరుసగా పరాభావాలు జరుగుతుండడం గమనార్హం.