Begin typing your search above and press return to search.

మత్తు మందిచ్చి నగ్న వీడియోలు తీసి పోర్న్ సైట్ లో అప్ లోడ్

By:  Tupaki Desk   |   28 Jun 2020 1:01 PM GMT
మత్తు మందిచ్చి నగ్న వీడియోలు తీసి పోర్న్ సైట్ లో అప్ లోడ్
X
గుంటూరులో దారుణం జరిగింది. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి నగ్నంగా వీడియో తీసి దాన్ని ఇన్ స్టాగ్రామ్, పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారు ఇద్దరు ప్రబద్దులు. ఈ కేసులో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన విద్యార్థినికి వరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.వరుణ్ తరుచూ కంబైన్డ్ స్టడీ పేరుతో ఆ యువతిని తన ఫ్లాట్ కు పిలిపించుకొని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అమెపై అత్యాచారం చేశాడు.. వాటిని చూపించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. 2 లక్షల రూపాయల వరకు బాధితురాలి నుంచి వసూలు చేశాడు. అనంతరం వరుణ్ తో యువతి సంబంధాలు తెంచుకుంది.

ఆ తర్వాత యువతికి ఇంజినీరింగ్ కాలేజీలో కౌశిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. వరుణ్ తో ఎఫైర్ పై కౌశిక్ కు బాధితురాలు తెలిపింది. దీంతో వరుణ్, కౌశిక్ ఇద్దరూ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయసాగారు. తమ దగ్గర ఉన్న వీడియోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు.

యువతి బంధువులు డబ్బులు ఇచ్చి ఆ వీడియోలను తీసివేయించారు. అయితే తాజాగా అవే పోర్న్ సైట్ లో అప్ లోడ్ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుణ్, కౌశిక్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు.