Begin typing your search above and press return to search.

కలికాలంలో అడ్వాన్స్ సంజీవిని..ఎలా ఉపయోగించాలంటే !

By:  Tupaki Desk   |   29 April 2020 11:00 PM IST
కలికాలంలో అడ్వాన్స్ సంజీవిని..ఎలా ఉపయోగించాలంటే !
X
కరోనా ..కరోనా ..ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తుంది. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఈ కరోనా దెబ్బకి విలవిలాడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 2,17,985 మంది మరణించారు. రోజు రోజుకు ఈ సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.

ఇకపోతే , ఈ కరోనా వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చి ,నెలలు గడుస్తున్నా కూడా సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు ఆదేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ తయారీ కోసం పలు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండకు చెందిన డాక్టర్ నీలిమ అనే మహిళ ఓ డివైజ్ ను తయారు చేసింది. దానికి అడ్వాన్స్ సంజీవిని అనే నామకరణం చేసింది.

ఈ డివైజ్ ను మణికట్టుపై పెట్టుకుంటే రక్తంలోని హానికరమైన కణాలు ఉంటె వాటిని ఈ డివైజ్ శుద్ధి చేస్తుంది. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్లడ్ కాన్సెప్ట్ ద్వారా ఈ డివైజ్ పనిచేస్తుంది అని ఆమె తెలిపింది. మాములుగా కరోనా వైరస్ వలన బ్లడ్ క్లాడ్స్ ఏర్పడతాయి. ఫలితంగా రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అవ్వడం తగ్గిపోతుంది. దీని ఫలితంగా మరణాలు సంభవిస్తుంటాయి. అయితే, ఈ డివైజ్ రక్తంలోని వైరస్ ను చంపేస్తుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే క్లాడ్స్ వంటివి కరిగిపోతాయని, ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద వీటికి అనుమతి ఇవ్వాలని డాక్టర్ నీలిమా కోరుతుంది. ఈ అడ్వాన్స్ సంజీవిని మిషన్ ద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని ఆమె అంటున్నారు