Begin typing your search above and press return to search.

తమిళనాడులో ప్రలోభాల పర్వం.. అడ్డంగా దొరికిపోయిన దినకరన్​..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 2:36 PM IST
తమిళనాడులో ప్రలోభాల పర్వం.. అడ్డంగా దొరికిపోయిన దినకరన్​..!
X
దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తమిళనాడులో రాజకీయాలు రక్తికడుతూ ఉంటాయి. ఎన్నికలు సమీపించాయంటే చాలు అక్కడ ఏ పార్టీ ఎటువంటి హామీలు, పథకాలు ప్రకటిస్తుందో అని దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలు, సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోని లేని విధంగా తమిళనాట వ్యక్తి పూజ, ప్రాంతీయాభిమానం, భాషాభిమానం పీక్స్​ ఉంటాయి. వ్యక్తి పూజకు కూడా తమిళనాడు పెట్టింది పేరు. దీంతో అన్నిరాష్ట్రాల చూపు ఆ రాష్ట్రంపైనే ఉంటుంది.

 ఎన్నికల నోటిఫికేషన్​ రావడంతో అన్ని పార్టీలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్​ సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్​ రాగానే.. తమిళనాట ప్రలోభాల పర్వం కూడా మొదలైంది. వివిధ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు.. తమ అనుచరులను సంతృప్తిపరిచేందుకు భారీగా తాయిలాలు పంచుతున్నారు.

అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవి దినకరన్  సొంతంగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్​ ప్రెషర్​ కుక్కర్​ను గుర్తుగా కేటాయించింది. దీంతో తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దినకరన్​ రాష్ట్రవ్యాప్తంగా భారీగా కుక్కర్లను పంపిణీ చేయాని ఫిక్స్​ అయినట్టున్నాడు.

ఇందులో భాగంగా దినకరన్​ పార్టీ అనుచరులు ఓ లారీలో మూడువేల కుక్కర్లను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. చైన్నై శివారులోని గుమ్మిడిపూడి వద్ద గోడౌన్​లో దినకరన్​ అనుచరులు భారీగా కుక్కర్లు నిల్వ చేశారు.అక్కడి నుంచే వివిధ జిల్లాలకు తరలిస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే అరియాలూరు జిల్లాలో పోలీసులు 3 వేల 300 కుక్కర్లతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. తనిఖీ చేయగా లారీలోని కుక్కర్లు శశికళ మేనల్లుడు టీటీవీ  దినకరన్​ పార్టీకి చెందిన వారివిగా చెబుతున్నారు. గుమ్మపూడి వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కుక్కర్లు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా తేలింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.