Begin typing your search above and press return to search.

ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు !

By:  Tupaki Desk   |   18 Sep 2020 12:30 AM GMT
ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు !
X
సాధరణంగా కొన్ని గ్రామాలని కలిపి ఓ పంచాయితీగా చేస్తారు. ఒకవేల ఆ గ్రామం కానీ పెద్దదైతే ఒకే గ్రామాన్ని పంచాయితీగా పరిగణిస్తారు. కానీ, ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు అనేవి ఎక్కడా ఉండవు. కానీ , అలాంటి గ్రామం ఒకటి ఉంది. అది ఒకే గ్రామం కానీ రెండు పంచాయితీలు. అయితే, పంచాయితీలు వేరైనా కూడా ఒకే ఊరికింద వారంతా కలిసి జీవిస్తున్నారు. ఆ గ్రామాలే బొబ్బిలి మండలంలో కాశిదొరవలస, నారాయణప్పవలస పంచాయతీలు. 26 ఏళ్లక్రితం వరకు ఈ పంచాయతీలు రెండూ నారాయణప్పవలస గ్రామంపేరిట ఉండేవి. అప్పట్లో నాటి ప్రభుత్వం ఈ గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించింది. నారాయణప్పవలస గ్రామంలో ప్రధానవీధిలో ఓ స్తంభం వద్ద ఈ రెండు పంచాయతీలకు సరిహద్దు నిర్ణయించారు.

అంతవరకు, ఒకే గ్రామంగా ఉన్నవారంతా రెండు గ్రామాల వారిగా విడిపోయారు. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు కావడంతో నారాయణప్పవలసలో శ్రీరాముని దేవాలయం ఉంటే, కాశిందొరవలసలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. రేషన్‌ షాపు, పాఠశాల నారాయణప్పవలసలో ఉన్నాయి. ఒకే రైల్వేస్టేషన్‌ కాశిందొరవలసలో ఉంది. దీనిని నారాయణప్పవలస రైల్వేస్టేషన్‌ అంటారు. కంచరగెడ్డ రిజర్వాయర్‌ కాశిందొరవలసలో ఉంది. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు ఉండడంతో అంతా కలిసి వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. నారాయణప్పవలస గ్రామం ఒక పంచాయతీ కాగా దీని పరిధిలో ఏ గ్రామాలూ లేవు. కాశిందొరవలస గ్రామానికి కాశిందొరవలస, దీని పరిధిలో డొంగురువలస, ఎరకందొరవలస, చిలకమ్మవలస, మోసూరువలసలు ఉన్నాయి. గ్రామంలోఅంతా కలిసి హాయిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.