Begin typing your search above and press return to search.
3 నెలల క్రితం యాక్సిడెంట్..మళ్లీ ఇప్పుడు..డ్రైవర్ ఒక్కడే..తేడా ఏమంటే?
By: Tupaki Desk | 1 Sept 2020 10:45 AM ISTదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణ ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళలో అత్యంత వేగంగా వచ్చిన కారు ఒక హోటల్ గోడను గుద్దుకుంది. ఆ వేగానికి హోటల్ గోడ కూలటమే కాదు.. కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ కారును డ్రైవర్ చేసిన సమీర్.. మూడు నెలల క్రితం మరో యాక్సిడెంట్ కు కారణమట.
అప్పట్లో ట్రక్కును ఢీ కొట్టిన సమీర్.. ఆ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. కానీ.. తాజాగా జరిగిన ప్రమాదంలో మాత్రం ముగ్గురు మరణించారు. కారు ఎంత వేగంగా దూసుకొచ్చిందంటే.. ఫుట్ పాత్ పైకి ఎక్కి.. హోటల్ గోడను ఢీకొట్టింది. ఆ ధాటికి గోడ కూడా కూలింది. అయితే.. ఇంతటి దారుణ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మాత్రం గాయపడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఇక.. ఘోర ప్రమాదానికి కారణమైన కారు కారణంగా హోటల్ యజమాని ఇప్పుడు చిక్కుల్లో పడినట్లుగా చెబుతున్నారు. ముంబయిలోని క్రాఫోర్డ్ మార్కెట్ ్పరాంతంలోని జనతా కేఫ్ గా సుపరిచితం. ఇదేమీ ప్రముఖమైన హోటల్ కానప్పటికీ.. కరోనా నేపథ్యంలో దాన్ని అప్ గ్రేడ్ చేసి.. కాస్త కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడిప్పుడే కాస్త జనాలు వస్తున్న వేళలో.. చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో.. ఈ ప్రమాదం తమ హోటల్ ను ప్రభావితం చేసే అవకాశం ఉందని హోటల్ వర్గాలు భావిస్తున్నాయట.