Begin typing your search above and press return to search.

ప్రేమ పరీక్షలో ఇల్లే తగలబెట్టుకున్నా... ప్రియురాలు పాస్ చేసింది

By:  Tupaki Desk   |   7 Aug 2020 9:00 AM IST
ప్రేమ పరీక్షలో ఇల్లే తగలబెట్టుకున్నా... ప్రియురాలు పాస్ చేసింది
X
ప్రేమించడం సులువే. కానీ అది వ్యక్తపరచడం చాలా కష్టం. కొంతమంది ప్రపోజ్ చేసే ధైర్యం లేక ఎదురుచూసి ఎదురుచూసి వన్ సైడ్ లవర్స్ గా నిలిచి పోతుంటారు. చాలా మంది డైరెక్టుగా ప్రపోజ్ చేయడానికి జంకుతుంటారు. లెటర్ పంపొ, బొకే చేరవేసో తమ ప్రేమను తెలుపుతుంటారు. మరి ప్రేమలో కచ్చితంగా నెగ్గుతాం అనే ధైర్యం ఉన్నవాళ్లు డైరెక్టుగా ఏ రింగో, చైనో కొంటుంటారు. షెపీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలిని ప్రేమించాడు. ఓ సారి సడన్ సప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తాను నివసించే అపార్ట్మెంట్ ను చక్కగా ముస్తాబు చేశాడు.

వందలాది కొవ్వొత్తులు ముట్టించి బెలూన్లు తెప్పించి డెకరేట్ చేశాడు. గ్లాసుల్లో వైన్ కూడా పోసి అంతా సిద్ధం చేశాడు. స్నేహితురాలిని తీసుకొచ్చి ప్రపోజ్ చేయాలని ఆమె కోసం వెళ్ళాడు. కాసేపటికి ఇద్దరూ రాగా అప్పటికే ఇల్లు తగలబడి పోతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. కొవ్వొత్తులతో మంటలు చెలరేగి ఉంటాయని గ్రహించాడు.

అప్పుడతనికి ఓ ఆలోచన వచ్చి తన స్నేహితురాలిని ఆరిన ఇంటి శిథిలాల్లోకి తీసుకెళ్లి 'నిన్నెంతో ప్రేమిస్తున్నానని' ప్రపోజ్ చేశాడు. తన కోసం ఇంత చేసి అన్ని పాట్లు పడ్డ ఆ యువకుడి ప్రేమను ఆమె మన్నించింది. 'ఐ టూ' అంటూ చెప్పేసింది. ఇదంతా చూసిన అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది. ప్రేమ ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైందని కొందరు, ఏ రింగో ఇవ్వకుండా కొవ్వొత్తులతో ఇల్లే తగలేసావ్ అంటూ మరి కొందరు సరదాగా అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.