Begin typing your search above and press return to search.

విజయనగరంలో వింత కుటుంబం ... ఏంచేస్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   5 Feb 2020 11:34 AM IST
విజయనగరంలో వింత కుటుంబం ... ఏంచేస్తున్నారంటే ?
X
అవునండి ! మీరు చదివేది నిజమే. సాధారణంగా మనం ఇంట్లోనే ఒక గంట సేపు ఉంటే ..ఇంట్లో ఉండటం చాలా కష్టం అంటుంటాం. కానీ , ఒక కుటుంబం మాత్రం కొన్ని గంటలు, కొన్ని రోజులు కాదు ..ఏకంగా నాలుగేళ్లుగా ఇంట్లో నుండి బయటకి రాకుండా జీవిస్తుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. ఈ సంఘటన ఎక్కడో జరగలేదు. మన రాష్ట్రంలోని విజయనగరంలో బొబ్బిలిలో జరిగింది. ఈ వార్త విన్న మనకే ఏదోలా ఉంటే ..నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో బయటకిరాకుండా ఉన్న వారి పరిస్థితి ఏంటో మరి. అసలు ఈ కుటుంబం ఎందుకు ఇంట్లో నుండి బయటకి రాలేదు. దానికి గల అసలు కారణం ఏంటి ..వారు ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో ఎలా నివసిస్తున్నారు అనే విషయాల గురించి పూర్తిగా ఒకసారి చూద్దాం..


విజయనగరం జిల్లా బొబ్బిలి లో ఓ వింత ఫ్యామిలీ ఉదంతం బయట పడింది. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ఆ ఇంటి యజమాని బయటకు రాడు. ఏ అవసరమైనా సరే.. అతనొక్కడే బయటకు వస్తాడు. అది కూడా జన సంచారం ఎక్కువగా లేని సమయంలో ఇంటినుంచి బయటకు వచ్చి.. పని చూసుకొని వెంటనే లోపలికెళ్లి తలుపులు వేస్తాడు. దారిలో ఎవరైనా పలకరించినా, చూసీ చూడనట్టే వెళ్లిపోతాడు. చుట్టాలెవరూ వారి ఇంటికి రారు. కనీసం పిల్లలను కూడా చదువుకునేందుకు స్కూల్‌ కు కి పంపడం లేదు.

దీనితో ఈ కుటుంబ పై స్థానికులు పోలీసులకి ,విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసారు. దీనితో రంగంలోకి దిగిన అధికారులు ...ఆ ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఈశ్వర్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అయన పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తనను డిప్యూటీ సీఎం చేయాలని, విజయనగరం బాధ్యతలు అప్పగించాలని , ఇంకా ఏవేవో చెప్పాడు. ప్రభుత్వ స్కూళ్ల లో తిరిగి తెలుగు బోధనను ప్రవేశ పెట్టాలన్నారు. వీలైతే విజయనగరం వరకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరాడు. రాష్ట్రంలో విద్యా విధానం బాగోలేదన్నారు.

అయితే , చూసేందుకు ఆ ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఏమీ లేనట్టు అనిపిస్తోంది. దీనితో ఎందుకు వారు ఇంట్లో నే ఉంటున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు ఎవరితోనూ మాట్లాడట్లేదు అని స్థానికులు ప్రశ్నించగా, వారి నుండి ఎటువంటి సమాధానం లేదు. అలాగే , కనీసం పిల్లలనైనా స్కూలుకు పంపించాలని కోరగా దానికి కూడా వారు ఒప్పుకోలేదు. దీనిపై బొబ్బిలి ఏఎస్ ఐ మాట్లాడుతూ.. బహుశా ఆ కుటుంబం మానసిక సమస్యలతో బాధపడుతోందన అనుమానం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించి వారికి అవసరమైన మెంటల్ హెల్త్ చెకప్ చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ వ్యవహారం పై అధికారులు సక్రమంగా స్పందించి వారి సమస్యలని పరిష్కరించాలని స్థానికులు తెలిపారు.