Begin typing your search above and press return to search.

మా ఆయన కోరికలు తీర్చలేకపోతున్నా.. లాక్ డౌన్ ఎత్తేయండి

By:  Tupaki Desk   |   26 Aug 2020 11:30 AM IST
మా ఆయన కోరికలు తీర్చలేకపోతున్నా.. లాక్ డౌన్ ఎత్తేయండి
X
కరోనా నేపథ్యంలో కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్షణం తీరిక లేకుండా కాలంతో పరుగులు తీసే వారు.. ఎంచక్కా ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు. నిమిషాల్ని రూపాయిలతో కొలిచే వారు.. బతికిపోతే చాలు భగవంతుడా అని వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరికొన్ని విచిత్రమైన సీన్లు ఇళ్లల్లో చోటు చేసుకుంటున్నాయి. కరోనా వేళ.. బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్ తగ్గిపోవటంతో ఇంట్లో వంట ఒత్తిడి పెరిగిపోతోంది. అంతేనా.. ఖాళీగా ఉండటం.. పని తక్కువగా ఉండటంతో ఇంట్లోని వారు అదే పనిగా తినటం.. టీవీలు.. కంప్యూటర్లు.. మొబైల్ ఫోన్లు చూసుకోవటం ఎక్కువైంది.

ఈ సమస్యలు ఇలా ఉంటే.. ఘనా దేశంలో పరిస్థితి మరోలా ఉందట. ఆ దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తోంది. ఇంట్లో ఉన్న భర్తల కారణంగా ఆ దేశ భార్యలు పలువురు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఖాళీగా ఉండటంతో.. భర్తల్లో సెక్సు కోరికలు భారీగా పెరిగిపోతున్నాయట. దీంతో.. భార్యలు తల పట్టుకుంటున్నారు. పని పాటా లేకుండా ఇంట్లో ఉంటున్న భర్తలు.. భార్యల్ని అదే పనిగా తమ సెక్సు కోరికలు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారట.

వారి కోరికల్ని తాము తట్టుకోలేకపోతున్నట్లుగా వాపోతున్నారు. ఒక మహిళ అయితే.. ఏకంగా దేశాధ్యక్షుడికి ఒక లేఖ రాసింది. తన భర్త కోరికల్ని తట్టుకోలేకపోతున్నానని.. వెంటనే లాక్ డౌన్ ఎత్తేయాలని వేడుకుంది. ఈ లేఖలోని సారాంశం ఆ దేశంలో వైరల్ గా మారింది. తన మాదిరే చాలామంది మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా ఆ మహిళ పేర్కొన్నట్లు చెబుతున్నారు.