Begin typing your search above and press return to search.

యాదాద్రి అద్భుత కళా వైభవమిదీ

By:  Tupaki Desk   |   14 Sept 2020 3:20 PM IST
యాదాద్రి అద్భుత కళా వైభవమిదీ
X
తెలంగాణలోనే గొప్ప ఆలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు తరచూ పర్యటిస్తూ అక్కడి పనులను వేగవంతంగా చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంపై తెలంగాణ సీఎం కెసిఆర్ కోట్లు ఖర్చు పెడుతున్నారు. యాదాద్రిని తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆలయ పునరుద్ధరణ కోసం ఏకంగా రూ.600 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.

వారాంతంలో పునర్నిర్మాణ పురోగతిని పరిశీలించడానికి కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. ఆలయ పునరుద్ధరణతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఆలయం, విల్లాస్, భక్తుల కుటీరాలు, పార్కింగ్ స్లాట్‌లను కలిపే రింగ్ రోడ్ అభివృద్ధి చేస్తున్నారు. పనులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సర్కార్ యాదాద్రి ఆలయ అభివృద్ధిని ఎలా చేస్తుందో తెలిపేలా తాజాగా కేటీఆర్ ఒక వీడియోను షేర్ చేశారు. రింగ్ రోడ్, పచ్చదనం మరియు కొత్తగా పునరుద్ధరించిన ఆలయం.. లోపల ఆలయ భాగం.. విగ్రహాలు, శిల్పకళా వైభవం ఎలా ఉందో తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే నిజంగా రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా యాదాద్రి ఖ్యాతికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

యాదాద్రిలో అన్ని పనులు పూర్తయిన తర్వాత సీఎం కేసిఆర్ దేశంలోని ప్రముఖ స్వామీజీలందరితో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. .