Begin typing your search above and press return to search.

మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి: గ‌తేడాదే చైనాలో వైర‌స్‌

By:  Tupaki Desk   |   9 Jun 2020 5:00 PM GMT
మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి: గ‌తేడాదే చైనాలో వైర‌స్‌
X
ప్ర‌స్తుతం మాన‌వ ప్ర‌పంచంపై తీవ్రంగా దాడి చేస్తున్న‌ మ‌హ‌మ్మారి వైర‌స్ విష‌యంలో బాధ్య‌త వ‌హించాల‌ని చైనాపై ఒత్తిడి పెరిగింది. ఈ సంద‌ర్భంగా ఈ దేశం తీరుపై ప‌లు అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ల్లో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. మ‌రికొంద‌రు ర‌హాస్యంగా ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చైనాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చైనాలో గ‌తేడాది డిసెంబ‌ర్‌లో వైర‌స్ విష‌య‌మై ప్ర‌పంచానికి తెలిసింది. కానీ ఆ దేశంలో అంతకుముందే ఈ వైర‌స్‌ విజృంభణ మొద‌లైంద‌ని ఓ అధ్య‌య‌నం చెబుతోంది. శాటిలైట్ నుంచి తీసిన ఫొటోల‌‌ ద్వారా గ‌తేడాది ఆగ‌స్టు నుంచే వైర‌స్ ఉనికి ప్రారంభ‌మైంద‌ని తెలిపింది.

కిక్కిరిసిన ఆస్ప‌‌త్రులు- పార్కింగ్‌, అక్క‌డి జ‌నాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన ప‌దాల ఆధారంగా ఈ విష‌యం తెలిసింద‌ని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ వెల్ల‌డించింది. అంటే చైనాలో 2019 ఆగస్టులోనే ఈ వైర‌స్ తీవ్రంగా దాడి చేయ‌డం మొద‌లుపెట్టింద‌ని ఆ సంస్థ పేర్కొంటోంది. అయితే ప్ర‌పంచానికి మాత్రం దాదాపు సంవ‌త్స‌రం ఆఖ‌రులో అంటే డిసెంబ‌ర్‌లో తెలిసింది. ఈ విష‌యంపై చైనాను ప‌లు దేశాలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

2019లో శాటిలైట్ ఫొటోల ఆధారంగా వూహాన్‌లో ఆస్ప‌‌త్రుల ద‌గ్గ‌ర జ‌నాల‌ ర‌ద్దీ అధికం‌గా క‌నిపించింద‌ని, అనూహ్య రీతిలో పార్కింగ్ స్థ‌లం కూడా నిండిపోయింద‌ని అధ్య‌య‌నం తెలిసింది. అదే స‌మ‌యంలో ఎక్కువ మంది జ‌నాలు ప్ర‌స్తుత వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న వారు అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. ఇంత‌కు మునుపు ఈ సీజ‌న్ల క‌న్నా భిన్నంగా ఆగ‌స్టులో ఈ ప‌దాల‌ గురించి వెతికిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపింది. దీంతో అప్ప‌టి నుంచే వైర‌స్ వ్యాప్తి ప్రారంభమైంద‌ని స్ప‌ష్టం చేస్తోంది. హువాన్ మార్కెట్‌లో వైర‌స్‌ను గుర్తించే స‌మ‌యానికి ముందే అది ఉనికిలో ఉంద‌న్న వాద‌న‌కు త‌మ‌ ఆధారాలు మ‌ద్ద‌తిస్తున్నాయని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ చెబుతోంది. అయితే వైర‌స్ తొలిగా అడుగుపెట్టిన‌ చైనాలో 83,040 కేసులు న‌మోదయ్యాయి. చైనా క‌న్నా అధికంగా అమెరికా, భార‌త్‌, బ్రెజిల్ ‌తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఆయా దేశాల్లో ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి.