Begin typing your search above and press return to search.

మీ ఫోన్లు జాగ్ర‌త్త‌: ఒక్క వాల్ పేప‌ర్‌‌తో క్రాష్ అవుతున్న ఫోన్లు

By:  Tupaki Desk   |   12 Jun 2020 3:15 AM GMT
మీ ఫోన్లు జాగ్ర‌త్త‌: ఒక్క వాల్ పేప‌ర్‌‌తో క్రాష్ అవుతున్న ఫోన్లు
X
చిన్న చిన్న కార‌ణాల‌తో మ‌న ఫోన్లు క్రాష‌వ‌డం.. అక‌స్మాత్తుగా ప‌ని చేయ‌కుండ‌పోతుంటాయి. అవేంటో మ‌న‌కు తెలియ‌వు. అన్ నోన్ విష‌యాలు మ‌నం ఆప‌రేట్ చేస్తుంటే ఇలా జ‌రుగుతుంటాయి. ఆ కార‌ణాలు ఏమిటో తెలియ‌కుండా మ‌నం రిపేర్ చేయిస్తాం. ఈ విధంగా భారీగా న‌ష్ట‌పోతుంటాం. మ‌నం కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌న ఫోన్ సుర‌క్షితంగా ఉంటుంది. ఇదే క్ర‌మంలో ఇప్పుడు ఒక వాల్ ‌పేపర్ ఆండ్రాయిడ్ ఫోన్లను క్రాష్ చేస్తున్న విష‌యం ఆందోళ‌న రే‌పుతోంది. కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ఈ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకుంటే.. మీ మొబైల్స్ స్క్రీన్‌లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోంది. ఇదే విష‌యాన్ని చాలామంది వాపోతున్నారు.

అమెరికాలోని మోంటానా ఓ రాష్ట్రం. ఆ ఫొటో హిమానీనద జాతీయ ఉద్యానవనంలో సెయింట్ మేరీ సరస్సు. ఈ క్రమంలో ఈ ఫొటో తీసిన వ్యక్తి ప్రస్తుతం తెర మీదకు వచ్చారు. శాస్త్ర‌వేత్త అగర్వాల్‌ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తుంటాడు. 2009 ఆగస్టులో సెయింట్ మేరిస్ స‌ర‌స్సు ఫొటో తీశారు. ఈ ఫొటో షేరింగ్‌ సైట్‌ ‘ఫ్లికర్’‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ఫొటో అందంగా ఉండ‌డంతో కొంద‌రు దీన్ని ఫోన్‌లో వాల్ ‌పేపర్‌గా వాడుతున్నారు. అయితే ఈ ఫొటో వాడిన అనంత‌రం ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాటంతట అవే ఆన్‌, ఆఫ్‌ కావడం.. క్రాష్‌ అవ్వడం జరుగుతున్నాయి.

ఈ వార్త ఫొటో తీసిన అగర్వాల్ దృష్టికి వ‌చ్చింది. ఈ అంశంపై ఆయ‌న స్పందించి మాట్లాడారు. ఎవరి ఫోన్‌ పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫొటో తీయలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ ఫొటోతో ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగే వరకు త‌న‌కు ఈ విష‌యం తెలియదని చెప్పారు. నికాన్‌ కెమెరాతో ఈ ఫొటో తీసి తరువాత 'లైట్‌రూమ్' అనే సాఫ్ట్‌వేర్‌తో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేశారు. అయితే ఫొటోను ఎక్స్‌ప్లోర్‌ చేయడానికి తాను ఎంచుకున్న కలర్ మోడ్ ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అనుకూలంగా లేదని అందుకే ఫోన్లు క్రాష్ అవుతున్నాయ‌ని వివ‌రించారు.

ఈ ఫొటోలో ఏమీ తప్పు లేదు, కాని ఇది ఎల్ఆర్ నుంచి ప్రో ఫొటో ఆర్‌జీబీ ఫార్మాట్‌లో ఎక్స్‌ప్లోర్‌ చేశానని, అందుకే ఈ ఫొటో ఆండ్రాయిడ్ ఫోన్‌కు అనుకూలంగా లేద‌ని అగర్వాల్ తెలిపారు. ఈ వాల్‌ పేపర్‌ సమస్య పెద్దది కావడంతో ఈ నెల 11వ తేదీన దీనికి సంబంధించి సామ్‌సంగ్ ఓ అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. ఆర్‌జీబీ కలర్ ఫార్మాట్‌లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్‌ఆర్‌జీ‌బీలో లేకపోవడంతో ఇలా జరుగుతుండొచ్చని సెల్‌ఫోన్ నిపుణులు అని చెప్పారు.