Begin typing your search above and press return to search.

బ్రిటన్ లో కొత్తరకం వైరస్ ... లాక్ డౌన్ విధించే అవకాశం

By:  Tupaki Desk   |   15 Dec 2020 11:20 AM IST
బ్రిటన్ లో కొత్తరకం వైరస్ ... లాక్ డౌన్ విధించే అవకాశం
X
ప్రపంచంలో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక చోట తగ్గిందిలే అనుకునేసరికి , మరోచోట మళ్లీ విజృంభిస్తుంది. గత ఏడాది గా కరోనా దాడి చేయని దేశం అంటూ లేదు. ప్రతి ఒక్కరూ కరోనా భారిన పడి అల్లాడిపోయినవారే. ప్రస్తుతం కూడా చాలామంది కరోనా దెబ్బకి అల్లాడిపోతున్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ వస్తే , దీని ప్రభావం తగ్గే అవకాశం అయితే ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక ఫైజర్ వ్యాక్సిన్ యూకే , అమెరికా లో వ్యాక్సినేషన్ స్టార్ట్ చెసారు. ఇదిలా ఉంటే .. బ్రిటన్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నది.

కరోనా వ్యాక్సిన్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. సోమవారం నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తు న్నారు. అయితే, కరోనా మహమ్మారి ఎప్పటి వరకు అంతం అవుతుందనే విషయంపై ఎవరూ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. లండన్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీనికి కరోనా కొత్తరకం వైరస్ కారణం అని వైద్యనిపుణులు చెప్తున్నారు. లండన్ లో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. బ్రిటన్ లో ఆంక్షలను మరింత కఠినం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక , బ్రిటన్‌ లో కొత్తగా వెయ్యి మందికి సోకిన కొత్తరకం కరోనా వైరస్‌ పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుత వైరస్‌కు భిన్నంగా ఇది వ్యవహరిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని పేర్కొంది. రోజులు గడిచే కొద్దీ కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతోందని, ఇప్పటికే అనేక రకాల వైరస్‌లను గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి మైఖేల్ ర్యాన్ తెలిపారు.