Begin typing your search above and press return to search.

తల్లి ప్రేమ ఎంత గొప్పదో చాటినా...కటకటాల పాలైన మహిళ

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:00 AM IST
తల్లి ప్రేమ ఎంత గొప్పదో చాటినా...కటకటాల పాలైన మహిళ
X
బిడ్డపై తల్లి ప్రేమకు కొలమానమే లేదు. ఆమె ప్రేమ అనంతం. తన కడుపున పుట్టింది మంచోళ్ళా, చెడ్డోళ్ల అనేది ఉండదు తల్లి బిడ్డ కోసం ఎంతటి త్యాగానికి కైనా సిద్దమవుతుంది. బిడ్డ ఆపదలో ఉంటే మంచా చెడా అని కూడా ఆలోచించకుండా ముందుకెళ్లి కాపాడు కుంటుంది. ఇలాగే ఓ తల్లి జైలు పాలైన తన కొడుకును కాపాడుకుందుకు ఏకంగా 35 అడుగుల సొరంగం తవ్విందంటే ఆశ్చర్యమనిపించక మానదు. నేరం చేసి జైలుకు వెళ్లిన తన కొడుకును కలిసేందుకు తల్లి వెళ్లగా.. తనను ఎలాగైనా బయటకు తీసుకెళ్లాలని కొడుకు కోరాడు. అందుకు ఓ ఉపాయం చెప్పాడు. దీంతో ఆమె కుమారుడి జైలుకు దగ్గరగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుంది.

పగలంతా ఇంటి పట్టునే గడిపేది. రాత్రవగానే బైక్ పై జైలు సమీప ప్రాంతానికి చేరుకుని పలుగు, పార తీసుకుని జైలు వైపుగా సొరంగం తవ్వడం చేసేది. అలా మూడు వారాల పాటు రాత్రంతా మేలుకొని 35 అడుగుల సొరంగం తవ్వింది. ఇక కొద్ది దూరం తవ్వితే తన కొడుకు గది వద్ద వరకూ వెళ్లొచ్చని సంతోష పడింది. ఒకరోజు ఆమె తవ్వకంలో నిమగ్నమై ఉండగా రోజువారీ తనిఖీలు నిర్వహించే పోలీసులు ఆమెను చూశారు. దగ్గరకు వెళ్లి చూడగా ఏకంగా 35 అడుగుల సొరంగం కనిపించడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా ఆమెకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. కాసేపు పలుగు, పార చేతబట్టుకుంటే తీవ్రంగా అలసి పోతాం..అలాంటిది ఆ తల్లి కుమారుడిని రక్షించుకునేందుకు ఏకంగా ఒక సొరంగమే తవ్విందని తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. బిడ్డ మంచోడా చెడ్డోడా అని తల్లి ఆలోచించదని, ఆపదలో ఉంటే ఎంతటి కష్టం అయినా అనుభవిస్తుందని, మరోసారి మాతృమూర్తి గొప్పతనం చాటిన ఆమెను కొనియాడుతున్నారు.