Begin typing your search above and press return to search.
అమెరికా ఉద్యోగులపై సూపర్ సోనిక్ ప్రయోగం
By: Tupaki Desk | 8 Jun 2018 11:39 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీంలో కొత్త కలవరం మొదలైంది. తమను చైనా అనూహ్య రీతిలో టార్గెట్ చేస్తోందనేది అగ్రరాజ్యాధిపతి టీంలో ఉన్న ఆందోళన. చైనాలోని గ్యాంగ్జౌ నగరంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో దౌత్యాధికారులు - కాన్సులేట్ సిబ్బంది - వారి కుటుంబసభ్యులు అంతుచిక్కని రోగాల బారినపడడం అగ్రరాజ్యాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో క్యూబాలోనూ 24 మంది అమెరికా దౌత్య సిబ్బంది ఇదే తరహా సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తమ ఉద్యోగులకు రక్షణ కల్పించటంలేదంటూ 15 మంది క్యూబా దౌత్యవేత్తల్ని అప్పట్లో దేశం నుంచి ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. సరిగ్గా క్యూబా లాంటి పరిస్థితే..చైనాలోనూ తమ ఉద్యోగులకు ఎదురవుతుండటంతో...అమెరికాలో కలవరం మొదలై ఏకంగా హెల్త్ అలర్ట్ ప్రకటించింది.
ఏప్రిల్ నెలలో చైనాలో అస్వస్థతకు గురై అమెరికాకు తరలించిన ఒక ఉద్యోగి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని అక్కడి వైద్యులు చెప్పారు. తాజాగా చైనాలోనూ కొందరు దౌత్యసిబ్బంది విపరీతమైన తలనొప్పి - వాంతులు - వింతవింత శబ్దాలు వినిపించడం - చెవులు పనిచేయకపోవడం - తల తిరగడం - నిద్రలేమి.. తదితర సమస్యలతో బాధపడుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అమెరికా హెల్త్ అలర్ట్ ను ప్రకటించి.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని చైనాకు తరలించింది. సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది.నరాల సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన భార్యభర్తలతోపాటు వారి పిల్లల్ని ఈ నెల 6న అమెరికాకు తరలించినట్లు విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. గతంలో క్యూబాలో అస్వస్థతకు గురైన వారి లక్షణాలు - ప్రస్తుతం చైనా బాధితుల లక్షణాలు ఒకేలా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలాఉండగా...ఈ పరిణామంపై కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. అమెరికా - చైనాల మధ్య వ్యాపార - వాణిజ్య పోటీ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తమ దౌత్యసిబ్బందిపై కావాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. గ్యాంగ్జౌ నగరంలో ప్రస్తుతం 170 మంది అమెరికా దౌత్యసిబ్బంది పనిచేస్తున్నారు. తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో కొంతకాలంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగులపై ధ్వని తరంగాల దాడులు - హానికారక కిరణాల్ని - విష వాయువుల్ని ప్రయోగించే అంశాల్ని కొట్టిపారేయలేమని అమెరికా అధికారులు అంటున్నారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని విదేశాంగశాఖ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు అమెరికా ఉద్యోగుల అస్వస్థతపై తమకు ఎలాంటి ఆధారాలు - కారణాలు కనిపించలేదని చైనా విదేశాంగశాఖ క్లారిటీ ఇచ్చింది.