Begin typing your search above and press return to search.

పాతబస్తీలో సొంత అక్కల్ని చంపేసిన ఉన్మాది

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:30 AM IST
పాతబస్తీలో సొంత అక్కల్ని చంపేసిన ఉన్మాది
X
ఒక ఉన్మాది ఉన్మాదం హైదరాబాద్ లో కలకలం రేపింది. పాతబస్తీకి చెందిన మాజీ బౌన్సర్ వ్యవహారం షాకింగ్ కు గురి చేసింది. రక్తం పంచుకు పుట్టిన ఇద్దరు అక్కల్ని చంపటమే కాదు.. మరో అక్కపైనా.. బావను చంపే ప్రయత్నం చేసిన వైనం సంచనలంగా మారింది. సోమవారం రాత్రి వేళలో జరిగిన ఈ ఉదంతాన్ని చూస్తే.. పక్కా ప్లానింగ్ తోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే?

చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్పరిధిలోని బార్కస్ సలాలాలో అహ్మద్ ఇస్మాయిల్ అనే మాజీ బౌన్సర్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇతడిపై గతంలో భార్యను గొంతుకోసి చంపిన కేసులో ప్రధాన నిందితుడు. గత ఏడాది మార్చిలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన కేసు విచారణ ఇంకా షురూ కాలేదు. తన భార్యను చంపేందుకు కారణమైన అక్కల్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి తెగబడినట్లుగా చెబుతున్నారు.

తాను వేసుకున్న పథకం ప్రకారం తల్లి ఆరోగ్యం బాగోలేదని అక్కలకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కలు రజియా బేగం.. జకిరాబేగంలు వచ్చారు. సాయంత్రం వేళలో వంటిట్లో ఉన్న అక్కల్ని గొంతు కోసేసి బయటకు వచ్చాడు. ఇంటికి దగ్గర్లో ఉండే మరో అక్క ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేశాడు. అడ్డొచ్చిన బావపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో అక్క మలికాబేగం తీవ్రంగా గా పడినట్లుగా చెబుతున్నారు.

అక్కడి నుంచి నాలుగో అక్క మలికా బేగంను చంపాలని డిసైడ్ అయిన ఇస్మాయిల్ వారింటికి వెళ్లాడు. అయితే.. అక్కకు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఓవైసీ ఆసుపత్రిలో చేర్చారని తెలుసుకొని.. ఆసుపత్రి లో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. అక్కడ పోలీసులు ఉండటం తో పారి పోయాడు. నాలుగో అక్క పై దాడి చేసేందుకు వెళ్లే దారిలో తెలిసిన వారు కనిపిస్తే.. గత ఏడాది తన అక్కలు చెప్పినందుకే తన భార్యను చంపానని.. ఇప్పుడు వారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.