Begin typing your search above and press return to search.

కరోనా సోకిందంటూ వరుడు అదృశ్యం.. అసలు ట్విస్ట్ ఇదే !

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:30 PM GMT
కరోనా సోకిందంటూ వరుడు అదృశ్యం.. అసలు ట్విస్ట్ ఇదే !
X
పెళ్లి వేడుకకి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు తరపు వారు పెళ్ళికి అన్ని సిద్ధం చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే అతి కొద్దిమంది సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి .. దానికి తగ్గట్టే బంధువులని కూడా వివాహానికి ఆహ్వానించారు. ఇక పెళ్లికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో పెళ్ళికొడుకు అందరికి అదిరిపోయే షాక్ ఇచ్చాడు. నాకు కరోనా సోకింది , క్వారంటైన్ సెంటర్ లో ఉన్నానని బాంధవులు , కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చాడు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుంది అని భావించిన ఇరు కుటుంబ సభ్యులు , బంధువులు పెళ్లి కొడుకు వ్యవహార తీరుతో షాక్ అయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలలో జరిగింది.

కానీ, చివరిలోనే అసలు పెళ్లి కొడుకు ఎందుకు ఇలా చేసాడు అనే అసలు విషయం బయటపడింది. పెళ్ళికొడుకు మాయం కావడానికి కారణం ఏంటో తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా ? పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన ఓ యవకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేశారు. బంధు మిత్రులకు కూడా సమాచారం అందించారు. శనివారం రాత్రి సమయంలో పెళ్లి జరగాల్సి ఉంది.

కానీ , ఆ యువకుడికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, పెళ్లి చేసుకోలేక పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో ఏమి చేయాలో తెలియక తనకు కరోనా వచ్చిందని చెప్పి ఎవరూ చూడకముందే అక్కడి నుండి మాయమైయ్యాడు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తనకు కరోనా వ్యాధి సోకిందని, తనను అనంతపురం నారాయణ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారని బంధువులు, స్నేహితులకు ఫోన్‌ ద్వారా చెప్పాడు. ఐతే , ఆ యువకుడి తీరుతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అధికారులని ఆరా తీయగా మీరు చెప్పే పేరు ఉన్న వ్యక్తిని తాము ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని స్పష్టం చేశారు అధికారులు, దీంతో పెళ్లి ఇష్టం లేని రామ్ కుమార్ తప్పించుకునేందుకు కరోనా వైరస్ పేరుని వాడుకున్నట్టు స్పష్టంగా అర్థమైంది.