Begin typing your search above and press return to search.

బోన్ లెస్ చికెన్ పేరును మార్చలట ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   5 Sep 2020 1:30 AM GMT
బోన్ లెస్ చికెన్ పేరును మార్చలట ..ఎందుకంటే  !
X
చికెన్ .. ఈ పేరు వింటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. చికెన్‌కు యూనివ‌ర్స‌ల్ ఫ్యాన్స్ ఉంటార‌న‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. పైగా క‌రోనా టైంలో ఎంత చికెన్ తింటే అంత రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక చికెన్‌ లో వంద‌ల ర‌కాల వంట‌కాలు ఉన్నాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. హోట‌ల్స్, రెస్టారెంట్ల‌లో చికెన్ పేరుతో త‌యారు చేసే చికెన్ క‌బాబ్స్‌, చికెన్ 65, బోన్‌ లెస్ చికెన్‌, చికెన్ క‌ర్రీ అంటూ వంద‌ల ర‌కాల మెనూ ఐట‌మ్స్ మ‌న క‌ళ్ల ముందు అలా ప్రత్యక్షం అవుతాయి. చికెన్ పేరు చెప్తేనే, లొట్ట‌లేసుకుని తినే ఈ రోజుల్లో నెబ్రాస్కాకు చెందిన ఒక వ్య‌క్తి మాత్రం బోన్‌ లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి చెందిన లింక‌న్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేసాడు. దీనికి సంబంధించిన వార్త .. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. నెబ్రాస్కాకు చెందిన అండ‌ర్ క్రిస్టిన్ ‌స‌న్ అనే వ్య‌క్తి బోన్ ‌లెస్ చికెన్ వింగ్స్‌ ను చికెన్ టెండ‌ర్స్‌ గా పేరు మార్చాలంటూ లింక‌న్ సిటీ కౌన్సిల్‌ లో తీర్మానం చేశాడు. అసలు క్రిస్టిన్ అలా ఎందుకు తీర్మానం చేశాడు అంటే.. బోన్ ‌లెస్ చికెన్ అనే ప‌దానికి అర్థం తెలుసుకోకుండానే ఆ పేరును వాడుతున్నారు. సాధార‌ణంగా బోన్‌ లెస్ చికెన్ అనే ప‌దం కోడిరెక్క‌ల‌ను విరిచి చెస్తారే త‌ప్ప మాంసం నుంచి ఎముక‌లను వేరు చేయ‌రు. ఎందుకంటే మ‌నం తినే మాంసంలో అధిక‌బ‌లం ఎముక‌ల్లోనే ఉంటుంది. ఆ విష‌యం తెలుసుకోకుండా రెస్టారెంట్ల‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు బోన్‌ లెస్ చికెన్ అనే పేరును వాడుతున్నారు. నేను వెళ్లిన ప్ర‌తీ రెస్టారెంట్ల‌లో ఇదే గ‌మ‌నించాను. నా పిల్ల‌లు కూడా బోన్ ‌లెస్ చికెన్ అర్థం తెలియ‌కుండానే ఆర్డ‌ర్ చేయ‌డం గ‌మ‌నించాను. అందుకే ఈరోజు సిటీ కౌన్సిల్ వేదిక‌గా ఒక తీర్మానం చేయాల‌నుకున్నాను.. అదే బోన్‌ లెస్ చికెన్ వింగ్ అనే పేరును హోట‌ల్స్ మెనూ నుంచి తొల‌గించాలి. బోన్ ‌లెస్ అనే ప‌దానికి బదులుగా చికెన్ టెండ‌ర్‌, సాసీ న‌గ్స్‌, వెట్ టెండ‌ర్స్ లాంటి పేర్ల‌ను పెడితే బాగుంటుంది...అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోనూ ఒక వ్య‌క్తి త‌న ట్విట‌ర్‌లో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌ గా మారింది.