Begin typing your search above and press return to search.

సాంబార్ సరిగా వండలేదని తల్లిని.. చెల్లిని చంపేశాడు

By:  Tupaki Desk   |   15 Oct 2021 11:00 AM IST
సాంబార్ సరిగా వండలేదని తల్లిని.. చెల్లిని చంపేశాడు
X
నిజంగా నిజం. మీరు చదివింది అక్షర సత్యం. సాంబార్ సరిగా వండని కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఒకడు.. కన్నతల్లిని.. సోదరిని చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. ఇంత చిన్న విషయానికి విలువైన రెండు ప్రాణాల్ని తీసిన ఈ రాక్షసుడి ఉదంతం గురించి తెలిసినంతనే ఉలిక్కిపడకుండా ఉండలేం. ఈ దారుణ ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకాలోని కడుగోడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంజునాథ మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం తాగుతూ బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరిగేవాడు. తాజాగా తాగిన మత్తులో ఇంటికి వెళ్లాడు. భోజనంలో సాంబార్ వేయగా.. దాని రుచి అతనికి నచ్చలేదు.

ఏమిటి? ఎందుకిలా తయారు చేశారు? అంటే 42 ఏళ్ల తల్లి పార్వతిని.. సోదరి రమ్యను ప్రశ్నించాడు. మాటా మాటా పెరగటం.. చివరకు గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. సాంబార్ రుచిగా చేయలేదని మండి పడ్డాడు. తన దగ్గరున్న నాటు పిస్టల్ తో కాల్చాడు. ఈ ఉదంతంలో తల్లి పార్వతి.. సోదరి రమ్యలు ఘటనాస్థలంలోనే మరణించారు. ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసుటు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.