Begin typing your search above and press return to search.

ఐ యూ బ్రోస్‌ లో అన్ని యువ‌తుల న‌గ్న ఫొటోలే!

By:  Tupaki Desk   |   8 May 2020 10:30 PM GMT
ఐ యూ బ్రోస్‌ లో అన్ని యువ‌తుల న‌గ్న ఫొటోలే!
X
మొన్న ఢిల్లీలో ఓ పాఠ‌శాల విద్యార్థుల బృందం బాయ్స్‌ లాకర్‌ రూం ఇన్‌ స్టాగ్రామ్ గ్రూపులో మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా మాట‌లు - అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్‌ పై చ‌ర్చ జ‌రిగిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి వ‌చ్చిన అంశం మ‌రువ‌క‌ముందే మ‌రోటి వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా గూగుల్ డ్రైవ్‌ లో ఐయూబ్రోస్ పేరుతో యువ‌తుల న‌గ్న ఫొటోలు.. వ్య‌క్తిగ‌త ఫొటోలు అన్ని ఉన్నాయి. తాజాగా అవి బ‌హిర్గ‌త‌మ‌వ‌డంతో దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌ లో చోటుచేసుకుంది.

జాదవ్‌ పూర్ విశ్వ‌విద్యాల‌యం (జేయూ)కి చెందిన ఓ వ్యక్తి గూగుల్‌ డ్రైవ్‌ లో అమ్మాయిల ప్రైవేట్‌ ఫొటోలు అప్‌ లోడ్ చేశాడు. ఆ ఫొటోల‌ను తన తోటి విద్యార్థులు - స్నేహితులు చూసే అవ‌కాశం కల్పించాడు. ఈ విష‌యాన్ని ఐయూబ్రోస్‌ ట్విటర్ నిర్వ‌హిస్తున్న ఓ మ‌హిళ బ‌హిర్గ‌తం చే‌సింది. ఆ విద్యార్థి తోటి విద్యార్థినులతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా మెలుగుతూ వారి ఫొటోలు పంపించాలని ఒత్తిడి చేసేవాడని ట్విట‌ర్ ద్వారా తెలిపింది. ఆమె ట్వీట్ ట్విట‌ర్‌ లో వైర‌లైంది. దీంతో ఆ వ్య‌క్తి బారిన ప‌డిన వారు మ‌రికొంద‌రు కూడా స్పందించి అది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే ఆ గూగుల్ డ్రైవ్ 2016లో క్రియేట్‌ చేసి ఉంది.

దీనికి సంబంధించి ఓ యువ‌తి ఏం జ‌రిగిందో వివ‌రంగా చెప్పింది. 2015లో అత‌డితో తనకు ప‌రిచ‌యం ఏర్పడిందని.. ఆ త‌ర్వాత తామిద్దరం యూనివర్సిటీ డిబేటింగ్ క్లబ్‌ లో కలిసి పాల్గొనేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలో అతడు తరచూ చాటింగ్ చేస్తూనే ఓ రోజు పర్సనల్‌ ఫొటోలు పంపాలని కోరాడు. ఒక‌సారి పంపు చూసి వెంటనే డిలీట్‌ చేస్తానని చెప్పాడు. అయితే అత‌డికి నో చెప్పినా విన‌కుండా తీవ్ర ఒత్తిడి చేశాడు. దీంతో ఒక ఫొటో షేర్‌ చేశా. అయితే 2018లో తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలను ఎస్‌ గూగుల్‌ డ్రైవ్‌ లో చూశానని ఓ వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యా. ఈ విషయం గురించి ఇప్పుడు బ‌హిరంగంగా చెబుతున్నా.. అని ఆమె ట్విట‌ర్‌ లో తెలిపింది.

అత‌డు త‌న జూనియ‌ర్ విద్యార్థుల‌ను కూడా ఈవిధంగానే అడిగి వారి వ్య‌క్తిగ‌త ఫొటోలు - న‌గ్న ఫొటోలు సేక‌రించి గూగుల్ డ్రైవ్‌ లో ఉంచేవాడు. ఆ ఫొటోల‌ను అత‌డి స్నేహితులు చూసేలా ఏర్పాటు చేయ‌డంతో ఆ అకౌంట్‌ లో మొత్తం ఇవే ఫొటోలు నిండిపోయాయి. వ్య‌క్తిగ‌త ఫొటోలు పంప‌క‌పోతే అతడు వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇబ్బందుల‌కు గురి చేసేవాడ‌ని తేలింది. ఆ క్ర‌మంలోనే ఎంతోమంది అమ్మాయిలు అత‌డికి ఫొటోలు పంపారు. సెమినార్లు జరుగుతున్న సమయంలో అమ్మాయిల ఫొటోలు తీసి ముఖభాగం మార్ఫ్‌ చేసేవాడు. ఈ ఫొటోల‌పై ఇత‌రుల కామెంట్స్‌తో పాటు మ‌హిళ‌ల ప్రైవేటు పార్ట్స్‌పై అస‌భ్యంగా కామెంట్స్ ఉన్నాయి.

అయితే ఆ వ్య‌క్తిని మీడియా విచారించ‌గా ఎలాంటి బెరుకు లేకుండా అది నా వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని చెప్పాడు. అమ్మాయిల ప్రైవేట్‌ ఫొటోలు స్టోర్‌ చేసిన మాట వాస్తవేమనని అంగీక‌రించాడు. ఆ ఫొటోల‌ను తాను ఎన్నడూ బయటపెట్టలేదని.. తన ఫోన్‌ పోగొట్టుకోవ‌డంతో అవి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటాయ‌ని తెలిపాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అత‌డిపై ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రూ ముందుకురాలేద‌ని తెలుస్తోంది.

కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే బాయ్స్‌ లాక‌ర్ రూం - గూగుల్ డ్రైవ్ ఘ‌ట‌న‌లు వెలుగులోకి రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సోష‌ల్ మీడియాను ఈ విధంగా వినియోగిస్తున్నారా? అని మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఎక్క‌డా భ‌ద్ర‌త లేకుండా పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.