Begin typing your search above and press return to search.

వైరల్: శానిటైజర్ దొంగ.. ఇలా చిక్కాడు!

By:  Tupaki Desk   |   15 Aug 2020 2:30 AM GMT
వైరల్: శానిటైజర్ దొంగ.. ఇలా చిక్కాడు!
X
కరోనా టైంలో ఇప్పుడు మాస్కులు, హ్యాండ్ వాష్ లు, శానిటైజర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బ్రాండెండ్ వి అస్సలే దొరకడం లేదు. అందరూ శానిటైజర్ తప్పనిసరిగా వాడడంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి.

ప్రస్తుతం ఎంత ఉత్పత్తి చేసినప్పటికీ ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. దీంతో సామాన్యులు శానిటైజర్ కొనడానికి ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో ఓ వ్యక్తి శానిటైజర్ కోసం కూడా కక్కుర్తి పడ్డ ఉదంతం కేరళలో చోటుచేసుకుంది. తాజాగా కేరళలోని ఓ షాపు వద్ద వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన శానిటైజర్లను దొంగతనం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ షాపు వద్ద ఓ వ్యక్తి ఖరీదైన శానిటైజర్ బాటిల్ ను దొంగతనం చేశాడు. తన లుంగీలో వేసుకున్నాడు. అయితే ఎదురుగా సీసీటీవీ కెమెరా ఉండడం చూసి ఆ వ్యక్తి తిరిగి బాటిల్ ను అక్కడ పెట్టేసి తనకేమీ తెలియదు అన్నట్టుగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో చిక్కడంతో వైరల్ అయ్యింది. అమ్మా దొంగ.. కెమెరాకు భయపడ్డావా అంటూ నెటిజన్లు కేరళలో సెటైర్లు వేస్తున్నారు..