Begin typing your search above and press return to search.

మగాడితో రోమాన్స్ చేయాలని వెళ్లి యువకుడి బలి

By:  Tupaki Desk   |   9 Sep 2020 3:45 AM GMT
మగాడితో రోమాన్స్ చేయాలని వెళ్లి యువకుడి బలి
X
గే సెక్స్.. మగాడితో సెక్స్ కోసం పరితపించాడు. అతడు పిలవగానే ఆబగా వెళ్లాడు. అడవిలోకి వెళ్లగానే అంచనా తప్పింది. ట్రెయిన్ రివర్స్ అయ్యింది. యువకుడు మోసపోయిప్రాణాలు పోగొట్టుకున్నాడు.

అసహజ శృంగారం కోరిక ఓ యువకుడిని బలి తీసుకుంది. గే డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తిని ఏకాంతంగా కలిసేందుకు వెళ్లి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

కామకోరికలు తీరుస్తానని పిలిపించి దోపిడీ యత్నం చేయడంతో కంగుతిన్న యువకుడు ఎదురుతిరిగాడు. దీంతో ఆగ్రహం చెందిన దుర్మార్గులు కిరాతకంగా పొడిచి చంపారు.

ఢిల్లీకి చెందిన సన్నీ దయాల్ (25)కు గే డేటింగ్ యాప్ లో సుమిత్ దబ్బా(20) పరిచయమయ్యాడు. అడవిలోకి వస్తే ఎంజాయ్ చేద్దాం అని పిలిపించాడు. వెళ్లిన దయాల్ ను దోచుకున్నారు. ఎదురుతిరిగినందుకు కత్తితో పొడిచి చంపారు.అతడి ఖరీదైన సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. డబ్బులు లాక్కెళ్లారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇలా మగాడితో సెక్స్ కోసం పరితపించి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు.