Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా కిలాడీ .. 100 మంది అమ్మాయిలతో ..!

By:  Tupaki Desk   |   24 July 2020 1:30 AM GMT
సోషల్ మీడియా కిలాడీ .. 100 మంది అమ్మాయిలతో ..!
X
సోషల్ మీడియా వాడకం ప్రస్తుత రోజుల్లో భారీగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. దీనితో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా లో ఎక్కువసేపు గడుపుతున్నారు. ముఖ్యంగా యువత పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునేవరకు సోషల్ మీడియా లోనే కాలం గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాను బేస్ చేసుకొని అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అమ్మాయిల ఫోటోలని మార్పింగ్ చేసి వారి నుండి డబ్బులు గుంజడం , ఇవ్వకపోతే మార్పింగ్ ఫోటోలని అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు.

తాజాగా క‌ర్నూలు జిల్లా ఆదోనిలో అలాంటి కిలాడి ఆట కట్టించారు పోలీసులు. అమ్మాయిలు ఫోటోలే త‌న క్రైమ్ కు పెట్ట‌బ‌డిగా పెట్టిన ఈ కిలాడీ గాడు .. అమ్మాయిల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో నుండి తీసుకోని, మార్పింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతాడు. ఇలా ఏకంగా 100 మందికి పైగా అమ్మాయిలు ఈ సైబ‌ర్ నేర‌గాడి వ‌ల‌లో ప‌డ్డారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలు ఫోటోల‌ను సేక‌రించి, వాటిని మార్పింగ్ చేసిన ఆ తర్వాత ..వాళ్ల నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసేవాడు. ఆ ఫోటోలు చూపించి వాడు అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కపోతే వాటిని బూతు సైట్ల‌లో పెడతాన‌ని బెదిరించేవాడు. దీంతో భ‌య‌ప‌డ్డ అమ్మాయిలు వాడు అడిగినంత డబ్బు ఇస్తూవచ్చారు.

అయితే , ఈ మధ్య ఈ కిలాడీ చేతుల్లో చిక్కిన హైదరాబాద్ కు చెందిన ఒక అమ్మాయి వాడి బెదిరింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం బయపడింది. కేసు న‌మోదు చేసుకున్న సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్ ని అరెస్టు చేశారు. విచార‌ణ‌లో సంచలన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. మహమ్మద్ పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ప‌లు కేసులు ఉన్న‌ట్లు , వీడి లిస్ట్ లో చాలామంది అమ్మాయిలు ఉన్నారని తెలిపారు.