Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ రూల్స్ ఉల్లంఘన .. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష

By:  Tupaki Desk   |   8 Sept 2021 12:23 PM IST
క్వారంటైన్‌ రూల్స్ ఉల్లంఘన .. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష
X
కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలను ఉ‍ల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్‌ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్‌ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్‌ నిబంధలను ఉల్లంఘించి, బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక వెల్లడించింది.

హోచి మిన్‌ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం.

వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్‌ ( హైబ్రిడ్‌ మ్యూటెంట్‌) కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. క‌రోనా ను అంటించాడంటూ ఒక వ్య‌క్తికి శిక్ష‌ను విధించ‌డం ఇదే ప్ర‌థ‌మం కాబోలు. క్వారెంటైన్ రూల్స్ ను అతిక్రమించాడంటూ శిక్ష అంటే అదో ర‌కం. అయితే, అత‌డి వ‌ల్ల స‌రిగ్గా ఎనిమిది మందికి క‌రోనా సోకింద‌ని నిర్ధారించ‌డం, వారిలో ఒక‌రి మ‌ర‌ణానికి అత‌డే కార‌ణ‌మంటూ తేల్చ‌డం ఏం న్యాయ‌మో. స‌రిగ్గా ఆ వ్యక్తే ఏమీ క‌రోనా వైర‌స్ ను సృష్టించ‌లేదు క‌దా, అత‌డూ కావాల‌ని ఆ వైర‌స్ ను అంటించుకుని ఉండ‌దు క‌దా, అలాగే క‌చ్చితంగా అత‌డి వ‌ల్ల‌నే సోకింద‌నేందుకు సాక్ష్యం ఎవ‌రు చెప్పిన‌ట్టు, క‌రోనా వైర‌స్ చెప్పిందా, లేక అత‌డి డీఎన్ ఏ ఏమైనా ఇత‌రుల వైర‌స్ మూలాల్లో బ‌య‌ట‌ప‌డిందా అనే విషయాలని పరిగణలోకి తీసుకుంటే ఈ రకమైన శిక్ష ఎక్కడవేయలేదనే చెప్పాలి.