Begin typing your search above and press return to search.
లవ్ చేసి పెళ్లాడాడు.. 28 రోజులకే గొంతు కోసేశాడు
By: Tupaki Desk | 27 Sept 2021 9:54 AM ISTఅయ్యో అనిపించే దారుణమిది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన బుజ్జితల్లిని ప్రేమ అంటూ వెంటపడ్డాడు. పేరెంట్స్ కు మించిన ప్రేమ దొరికిందన్న సంతోషంతో ప్రేమించినోడ్ని పెళ్లాడింది. అనుమానం పెనుభూతంగా మారి.. రాచి రంపాన పెట్టటమే కాదు.. పెళ్లి చేసుకున్న 28 రోజులకే జీవితానికి సరిపడా నరకాన్ని చూపించాడు.
అనుమానం రోగంతో గొంతు కోసేసి చంపేసిన దారుణ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతినగర్ లో చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన ఈ దుర్మార్గుడు.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లికి చెందిన గంగారాం లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె 22 ఏళ్ల సుధారాణి. కామారరెడ్డికి చెందిన కిరణ్ తో ఆమె ప్రేమలో పడ్డారు. ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుకొని వారికి ఈ ఏడాది ఆగస్టు 27న పెళ్లి చేశారు. వారం క్రితం ప్రగతినగర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం సుధారాణికి తల్లి ఫోన్ చేసి.. తాము వస్తున్నట్లుగా ఫోన్ చేసి చెప్పగా.. ‘మీరు బయలుదేరారా.. త్వరగా రండి’ అంటూ గద్గద స్వరంతో చెప్పినట్లుగా వారు చెబుతున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అపార్ట్ మెంట్ కు వచ్చి తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయలేదు. కూతురు.. అల్లుడు ఫోన్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. బెడ్రూంలో సుధారాణి రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది.
ఆమె మెడ మీదా.. శరీర భాగాల్లో బ్లేడుతో కోసిన గాయాలు ఉన్నాయి. సుధారాణి చనిపోయిన గదిలోని బాత్రూంలో కిరణ్ సైతం గాయాలతో పడి ఉన్నాడు. పోలీసుల సాయంతో అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసి.. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పెళ్లైన వారం నుంచే అనుమానంతో సుధారాణిని కిరణ్ వేధింపులకు గురి చేసేవాడని చెబుతున్నారు. ఒకసారి గొంతు నులిమి హత్య చేయటానికి ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ మధ్యనే ఇరుకుటుంబాల వారు పంచాయితీ పెట్టి.. వారం క్రితమే వారిని హైదరాబాద్ కు కాపురానికి పంపినట్లుగా చెబుతున్నారు. కిరణ్ గతంలోనూ సైకోలా వ్యవహరించేవాడని చెబుతున్నారు. పెళ్లికి నాలుగు నెలల ముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని.. అప్పటి నుంచి అతని తీరులో మార్పు వచ్చినట్లుగా నిందితుడి తండ్రి చెబుతున్నారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ గురించి తెలిసినా కూడా పెళ్లికి ముందు తమకు చెప్పకుండా దాచారని.. అతడి తల్లిదండ్రుల ఇంటిపైకి దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా విన్నప్పుడు పాడు ప్రేమ ఎంత పని చేసిందన్న భావన కలుగక మానదు.