Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకుందాం అంటూ ప్రియురాలిని గుడికి రమ్మన్న ప్రియుడు .. తీరా అక్కడికి వెళ్తే ..?

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:30 AM GMT
పెళ్లి చేసుకుందాం అంటూ ప్రియురాలిని గుడికి రమ్మన్న ప్రియుడు .. తీరా అక్కడికి వెళ్తే ..?
X
ప్రేమ .. అసలు ఈ సమాజం లో జరిగే కొన్ని కొన్ని సంఘటలు గురించి తెలుసుకున్న తర్వాత ప్రేమ అనేది అసలు ఉందా అని అనిపించకమానదు. ఎందుకు అంటే, ఆ సంఘటనలు కూడా అలాగే ఉంటాయి మరి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరు చెప్పి మోసం చేసే వారే ఎక్కువ ఉన్నారు. ప్రేమ పేరుతొ కావాల్సినన్ని రోజులు వాడుకోవడం , ఆ తర్వాత మోసం చేయడం. ఈ తరహా ఘటనలు రోజులో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుందాం గుడికి రమ్మని చెప్పిన ప్రియుడి మాటలు నమ్మి , ప్రేమికురాలు గుడికి వస్తే , ప్రేమికుడు ఎంత సేపు ఎదురు చూసినా రాలేదు. చివరికి మోసపోయానని గ్రహించిన యువతి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో డయల్ 100కి ఫోన్ చేసింది. స్పందించిన పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. శామీర్‌పేట మండలం దేవరయాంజల్ ‌కి చెందిన యువతి మేడ్చల్ సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న ఉదయం పది గంటలకు సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట గుడిలో పెళ్లి చేసుకుందామని అతడు ప్రియురాలికి చెప్పాడు. అది నమ్మిన యువతి అనుకున్న సమయానికి అక్కడికి చేరుకుంది. గుట్ట వద్ద గుడిలో ప్రియుడు కనిపించలేదు.

అతని కోసం ఎంతసేపు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. తీరా సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. ఒంటరిగా అక్కడే ఉండి యువతి మోసపోయానని గ్రహించి ఏం చేయాలో పాలుపోక డయల్ 100కి ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. వర్గల్ మండలంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఏఎస్సై మధుసూదనరావు, బ్లూకోల్ట్ సిబ్బంది వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. యువతి వివరాలు ఆరా తీసి క్షేమంగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించడంతో సుఖాంతమైంది.