Begin typing your search above and press return to search.
కొత్తపేరు: కిమ్ అసలైన వారుసుడు ‘ఇతడే’
By: Tupaki Desk | 29 April 2020 9:23 PM ISTఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితి. చావు బతుకుల మధ్య ఉన్నాడని.. ఆయన చేయించుకున్న గుండె సర్జరీ తిరగబెట్టిందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎన్ఎన్ కథనం తెలిపింది. హాంగ్ కాంగ్ మీడియా అయితే ఆయన చనిపోయాడని రాసుకొచ్చాయి.
కిమ్ బయటకు రాకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. కిమ్ చిన్న చెల్లెలు కిమ్ యో జంగ్ తర్వాతి వారసురాలు అని వార్తలు వస్తున్నాయి. అయితే తర్వాత అధ్యక్షుడు ఈమె కాకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పురుషాధిక్య ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళను అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
ఈ వార్తల నేపథ్యంలోనే కిమ్ చిన్నాన్న కిమ్ ప్యాంగ్ ఇల్ (65) పేరు తాజాగా ఉత్తరకొరియా అధ్యక్ష రేసులో బయటకొచ్చింది. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ వారసుల్లో ఒకడు ఈ ప్యాంగ్ ఇల్. ఇయనే చివరివాడు. ఉత్తరకొరియా తదుపరి అధ్యక్షుడిగా ఇయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలో మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 4 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన పేరు కిమ్ మరణం తో తెర పైకి రావడం విశేషంగా మారింది.
1970లో ఉత్తరకొరియాలో అధ్యక్ష పదవి కోసం పోటీ జరిగింది. అయితే అన్న కిమ్ జోంగ్ ఇల్ చేతిలో ప్యాంగ్ ఇల్ ఓడిపోయాడట. తర్వాత హంగేరి, బల్గేరియా, ఫిన్ లాండ్, పోలండ్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో పలు దౌత్య పదవుల్లో ఈయన పనిచేశారు. ఏడాది క్రితం స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ నేపథ్యంలోనే అనుభవజ్ఞుడైన ప్యాంగ్ ఇల్ పేరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కిమ్ ప్రాణాలతో లేకుంటే ప్యాంగ్ కు అవకాశం ఇవ్వాలని అక్కడి మేధావులు కోరుతున్నారు.
ప్యాంగ్ అన్న కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తరకొరియాను పాలించారు. ఆయన మరణం తర్వాత కుమారుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు.
అయితే కరోనాకు భయపడే కిమ్ జాంగ్ ఉన్ అజ్ఞాతంలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.