Begin typing your search above and press return to search.
మందుబాబులకు అదిరిపోయే శుభవార్త .. ఆన్లైన్ లో మద్యం అమ్మకాలు .. ఇలా బుక్ చేస్తే ఆలా ఇంటికి ..
By: Tupaki Desk | 24 Sept 2020 11:02 PM ISTమద్యం డోర్ డెలివరీ .. ఈ న్యూస్ ఎవరికీ నచ్చినా , నచ్చకపోయినా కూడా కరోనా కాలంలో వైన్స్ ముందు భారీ క్యూ లైన్స్ లో నిలబడలేకపోతున్న మందుబాబులకు ఫ్రీ గా కోటర్ తగినంత కిక్కు ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇప్పటివరకు మనకి ఫుడ్ , పిజ్జా ఎం కేక్ డెలివరీ ఇచ్చేవారు. మందు కూడా ఇలా బుక్ చేస్తే అలా ఇంటికి వచ్చేస్తే ఏంచెక్కా భలే ఉంటుంది కదా ! అని అనుకోని ఉంటారు. అది అతి త్వరలో తీరబోతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్ లైన్ సోషల్ డ్రింకింగ్ ప్లాట్ ఫాంను ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ప్రకటించింది.
Booozie(బూజి ) పేరుతో ఇన్నోవెంట్ టెక్నాలజీస్ స్టార్టప్ దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇది వెబ్, యాప్ ఆధారిత సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం. దీని ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని మద్యం బ్రాండ్లు, అలాగే ఆయా రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉండే ప్రత్యేక బ్రాండ్లను కూడా వినియోగదారులు కొనుక్కోవచ్చు. వివేకానంద్ బలిజెపల్లి, సుసోవన్ మజుందర్ దీని వ్యవస్థాపకులు. ఇప్పటికే హైదరాబాద్లో సేవలందించడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామని , అన్ని అనుమతులు వస్తే అతి త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు.
రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ పేరుతో ప్రమోటింగ్ చేసుకోనున్న ఈ సంస్థ ప్రత్యేక సేవలందిస్తుంది. ప్రతి నగరంలోని బార్లు, క్లబ్ల డేటా బేస్, వివిధ బార్లు, క్లబ్లలో ఆఫర్లు, ఈవెంట్లు, బ్రాండ్లకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచి , రాష్ట్రాల వారీగా వాటికి అయ్యే ఖర్చును జాబితాలో పొందుపరుస్తారు. వీటిని ఆన్ లైన్లో ఆర్డర్ చేసిన వారికి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే .. ఈ యాప్లో ఎవరైనా మద్యం బుక్ చేసుకోవచ్చని , డెలివరీ చేసే వ్యక్తి సమీప వైన్ షాప్ నుంచి మద్యం తీసుకొని వినియోగదారులకు అందిస్తారని , దీనికోసం ముందుగానే వైన్ షాప్ ల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. మద్యం అమ్మినందుకు వైన్స్ నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోరు. వినియోగదారులకు ఉచితంగా డెలివరీ చేస్తారు. తమ సంస్థకు వచ్చే లాభాల నుంచి జాతీయ రక్షణ నిధికి, సంబంధిత రాష్ట్ర సీఎం- కరోనా రిలీఫ్ ఫండ్ కు కేటాయిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే వచ్చే నెలల్లో 1000కి పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బూజీ సంస్థ ప్రకటించింది.
ప్రభుత్వ సూచనల మేరకు మేము సామాజిక దూరాన్ని ప్రోత్సహిస్తున్నాం. బార్లు, క్లబ్లలో మద్యపానాన్ని మేము అనుమతించం. ఆంక్షలను ఎత్తివేసిన తరువాత వినియోగదారులను బార్లు, క్లబ్లకు కనెక్ట్ చేయాలని భావిస్తున్నాం. ప్రతి నగరంలోనూ బార్లు, క్లబ్ల డేటాబేస్ మా దగ్గర ఉంది. కూపన్లు, ఈవెంట్లు, ఇతర ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించనున్నాం. మా కేటలాగ్ రేటింగ్ సిస్టమ్ ద్వారా మద్యం తయారీదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో అందుబాటులో లేని ప్రత్యేక బ్రాండ్ల డిమాండ్ను అంచనా వేయడానికి సహాయం చేయాలనుకుంటున్నాం” అని వివేకానంద్ తెలిపారు.