Begin typing your search above and press return to search.

భార్య హింస పెడుతుందని పోలీస్ స్టేషన్ ను తగలబెట్టేశాడు

By:  Tupaki Desk   |   31 Aug 2021 6:00 PM IST
భార్య హింస పెడుతుందని పోలీస్ స్టేషన్ ను తగలబెట్టేశాడు
X
మీరు చదివింది అక్షరాల నిజం. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. భార్య పెట్టే హింసను భరించలేని భర్త ఒకరు చేసిన పని షాక్ తినేలా చేసింది. భార్య మీద కోపం.. ఆమె మీద చూపించలేక.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందన్న వివరాల్లోకి వెళితే..

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈ విచిత్రమైన ఉదంతం చోటు చేసుకుంది. భార్య తీరుతో విసిగిపోయిన ఒక వ్యక్తి ఆమె మీద కోపాన్ని చూపించలేదు. నేరుగా జవరంగ్ వాడి పోలీస్ స్టేషన్ కు వచ్చి నిప్పు పెట్టాడు. భార్యతో గొడవ పడిన అతగాడు అందుకు ఏ మాత్రం సంబంధం లేకుండా స్టేషన్ కు నిప్పు పెట్టిన వైనం సంచలనంగా మారింది.

అంతేకాదు.. స్టేషన్ కు నిప్పు అంటించిన తర్వాత అక్కడ నుంచి పారిపోకుండా ఉండటం మరో విశేషంగా చెప్పాలి.
పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన అనంతరం.. అక్కడే నిలబడ్డ అతడు.. తనను అరెస్టు చేయాల్సిందిగా కోరాడు.

ప్రభుత్వ ఆస్తుల్ని ఎందుకు ద్వంసం చేశావని అడిగితే.. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తన భార్య తనను వేధింపులకు గురి చేయటం మొదలు పెట్టినట్లు చెప్పాడు. తన భార్య నుంచి తాను విముక్తి కావాలంటే.. ఇదే మార్గమని తాను అనుకున్నట్లు చెప్పాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రశ్నించగా.. అతడి మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని విచారణలోతేలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఓపక్క స్టేషన్ తగలబడి.. మరోవైపు దానికి కారణమైన వ్యక్తి మానసిక పరిస్థితి బాగోని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.