Begin typing your search above and press return to search.

పోలీసుల అండతో బెంగుళూరులో హైటెక్ గ్యాంబ్లింగ్

By:  Tupaki Desk   |   13 Oct 2020 4:52 PM GMT
పోలీసుల అండతో బెంగుళూరులో హైటెక్  గ్యాంబ్లింగ్
X
బెంగుళూరులో హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టయింది. బెంగుళూరులోని ‘బెంగళూరు ఇన్’ అనే హోటల్ లో అక్రమంగా హైటెక్ గ్యాంబ్లింగ్ కేంద్రం నిర్వాకం బట్టబయలైంది. బెంగుళూరుకు చెందిన ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ అండతో కడపకు చెందిన శశి అనే ఓ వ్యక్తి ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారమిచచారు. ప్రతి రోజు ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో పోలీసులు షాకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారమంతా తమ శాఖకు చెందిన వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్నాయని తెలిసి నివ్వెరబోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరుకు చెందిన 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు రూ. 85 లక్షల నగదు, 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ కేంద్రం నిర్వాహకుడితో చేతులు కలిపిన ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు.

కడపకు చెందిన శశి బెంగళూరు ఇన్ హోటల్ లో హైటెక్ పేకాటకేంద్రం నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. అక్కడ ఎంట్రీ ఫీజు రూ. 5 వేలు ఫిక్స్ చేసిన నిర్వాహకులు,, నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారమంతా మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగళూరు ఇన్ హోటల్ లో జరుగుతోందని, ఆ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అశ్వథ్ నారాయణస్వామికి, హెడ్ కానిస్టేబుల్ జయకిరణ్ కు దీని గురించి ముందే తెలుసని చెప్పారు. శశి దగ్గర నుంచి మామూళ్లు వసూలు చేసిన వారిద్దరూ....పేకాటకు సహకరించారని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దీంతో, అశ్వథ్ నారాయణస్వామితో పాటు హెడ్ కానిస్టేబుల్ జయకిరణ్ ను సస్పెండ్ చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెప్పారు. ఈ కేసును పోలీసులు విచారణ జరుపుతున్నారు.