Begin typing your search above and press return to search.
పెళ్లిళ్లకు నీవే గురువు.. బాసు
By: Tupaki Desk | 18 Feb 2020 3:45 PM ISTఅతడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి.. ఆదర్శంగా ఉండాల్సింది.. పోయి పక్కదారి పట్టాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడు... ఇప్పుడు కటకటలపాలయ్యాడు. వంద అబద్ధాలు చెప్పి అయినా పెళ్లి చేసుకోవాలని ఉండగా ఆయన అవే అబద్ధాలు చెప్పి ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో వెలుగు చూసింది. మొదటి భార్య బతికుండగానే.. ఆమె చని పోయినట్లు నమ్మించి పేద కుటుంబాలకు చెందిన యువతులను వరుస వివాహాలు చేసుకున్నాడు. ఆ విధంగా చెప్పి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్ననిత్య పెళ్లి కొడుకుని అతడి రెండో భార్యనే పట్టించింది. ప్రతి సోమవారం నిర్వహించే ‘పోలీస్ స్పందన’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు కు అతడి రెండో భార్య ఫిర్యాదు చేయడం తో అతడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్ వల్లూరుకు చెందిన మహమ్మద్ బాజీ అలియాస్ షేక్ బాజీ అదే గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా బాధితురాలి తండ్రిని నమ్మించి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత వేరు కాపురం పెడతామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంచాడు. ప్రతి ఆదివారం ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లకు ఆమె వద్దకు రావడం మానేశాడు. దీంతో ఆమె అతడిని నిలదీయగా నాలుగు సంవత్సరాల కిందట కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో వివాహం చేసుకుని రహాస్య కాపురం పెట్టాడని తెలిసి షాక్ కు గురైంది. ఈ విషయమై అతడిని నిలదీయగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె గర్భస్రావమై తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో ఆమెను ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు.
ఏమైందో ఏమో గానీ కొన్నాళ్లకు ఆమె వద్దకు నెలకోసారి వచ్చి వెళ్తున్నాడు. ఆ సమయంలోనే ఆమె పెద్దలు అతడిని నిలదీయడంతో తన ఆస్తుల్ని రెండో భార్య పేరిట రాస్తానని, ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఇటీవల దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులకు రూ.30 వేలు ఇచ్చి ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. వీటన్నిటి తెలుసుకున్న రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాజీ మొదటి భార్య బతికే ఉందని, అతడి వేధింపులు భరించలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ విధంగా అతగాడు వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని గురువుగా నిలిచాడు.