Begin typing your search above and press return to search.

భారత సరోగసీ తల్లులుకు శుభవార్త చెప్పిన కేంద్రం

By:  Tupaki Desk   |   25 Jun 2022 1:30 AM GMT
భారత సరోగసీ తల్లులుకు శుభవార్త చెప్పిన కేంద్రం
X
దేశంలో సెలబ్రెటీలంతా పిల్లలను కనే ఓపిక లేక తమ అండాన్ని అద్దెగర్భాల్లో పెట్టి పిల్లలను కనేస్తున్నాయి. ఇక కొందరు పిల్లలు లేక సతమతమయ్యే వారు అద్దె గర్భాల ద్వారా పిల్లలను కంటుటారు. ఈ పద్ధతే 'సరోగసి' విధానం.  పేద మహిళలను ఆసరాగా చేసుకొని డబ్బున్న వారు తమ పిల్లలను కంటుంటారు.

బాలీవుడ్ హీరోలు షారుక్, అమీర్ ఖాన్, నిర్మాత కరణ్ జోహర్,  తెలుగులో మంచు లక్ష్మీ  లాంటి వారు ఇలానే పిల్లలను కన్నారు. అయితే ఇన్నాళ్లు విధానం అంటూ లేని ఈ సరోగసికి తాజాగా కేంద్రం బిల్లు ద్వారా చట్టం చేసింది.

ఇక విదేశాల నుంచి కూడా వచ్చి మన భారతీయ మహిళల గర్భాలను అద్దెకు తీసుకొని పిల్లలను కని తీసుకెళ్లిపోతున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతోంది.. ఈ సరోగసీ విధానం దేశంలో విచ్చలవిడిగా సాగుతోంది. పేద మహిళలను టార్గెట్ చేసి వారిచేత పిల్లలను కనిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కేంద్రం ఈ విషయంలో స్టిక్ట్ రూల్స్ పెట్టింది. సరోగసీ విధానంలో పిల్లలను కనాలనుకున్న జంటలు ఇకపై అద్దె గర్భం దాల్చే వారికి ఆరోగ్యబీమా ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. సరోగసీ తల్లులకు మూడేళ్ల పాటు ఈ రక్షణ కవచాన్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  ఈ ఏడాది జనవరి 25న 'సరోగసీ నియంత్రణ చట్టం2021' అమలులోకి రాగా.. అద్దె గర్భం దాల్చే తల్లుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నెల 21న కొన్ని విధివిధానాలను నిర్ధేశించింది.

కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలు సరోగసి తల్లులకు గొప్ప వరంగా మారనున్నాయి. బిడ్డను కన్నాక తీసుకెళ్లిపోయే తల్లిదండ్రులు ఈ సరోగసీ తల్లిని పట్టించుకోరు. దీంతో వారి ఆరోగ్యం చెడితే రక్షణ ఉండదు. అందుకే గర్భిణీగా ఉన్న సమయంలోనూ.. ప్రసవానంతరం ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు సంబంధించిన చికిత్సల మొత్తానికి సరిపడేలా సరోగసీ తల్లులకు మొత్తం 3 ఏళ్ల పాటు ఆరోగ్య బీమా చేయించాలని ఈ విధానాన్ని ఎంచుకునే జంటలకు స్పష్టం చేసింది. వారి వైద్య ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, జబ్బులతోపాటు మరణాలు సంభవిస్తే అందుకు సరిపడా పరిహారాన్ని చెల్లిస్తామంటూ న్యాయస్థానంలో ప్రమాణ పత్రం సమర్పించాలని కేంద్రం పేర్కొంది.  

సరోగసి బిల్లు-2020కి   కేంద్ర కేబినెట్ పోయిన సంవత్సరం ఆమోదం  లభించింది. ఈ బిల్లు సరోగసి ద్వారా తల్లులు కాబోయే మహిళలకు వరం కానుంది. వింతతువులకు , విడాకులు తీసుకున్న మహిళలకు, బిడ్డలకోసం అల్లాడే దంపతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయ జంటలు మాత్రమే ఈ సరోగసి ద్వారా పిల్లలను కనేలా నిబంధనలు విధించినట్టు తెలిపారు. ఇక ఈ సరోగేట్ తల్లికి 36 నెలలు ఇన్సూరెన్సు వర్తింపచేయనున్నట్టు తెలిపారు.