Begin typing your search above and press return to search.

నగ్నంగా విదేశీ మహిళ చిందులు.. ఆపై హోటల్ సిబ్బందితో గొడవ..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
నగ్నంగా విదేశీ మహిళ చిందులు.. ఆపై హోటల్ సిబ్బందితో గొడవ..!
X
దేశంలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విదేశీయులు నిత్యం భారత్ కు వస్తుంటారు. ఈక్రమంలోనే వివిధ రాష్ట్రాల్లోనే ప్రాంతాలను సందర్శిస్తుంటారు. అలాగే భారతీయుల సంప్రదాయాల పట్ల ఆకర్షితులు అవడమే కాకుండా మన వంటకాలకు ఫిదా అవుతూ ఉంటారని అందరికీ తెల్సిందే.

చాలా విదేశీయులు భారత్ లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడి పోతున్నారు. ఇటీవల కాలంలో విదేశీయులు భారతీయులను వివాహం చేసుకుంటున్నారు. మనవాళ్లు విదేశీయులను.. విదేశీయులు మనవాళ్లను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న ఘటనలు ఇటీవల తరుచూ వెలుగు చూస్తున్నాయి.

కాగా ఓ విదేశీ మహిళ మాత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నగ్నంగా చిందులు వేయడమే కాకుండా సిబ్బంది జట్టుపట్టుకొని చితకబాదిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఆ విదేశీ మహిళ నగ్నంగా హోటల్ గది నుంచి బయటికి వచ్చి సిబ్బందితో గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ లోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ఒక విదేశీ మహిళ తన ఫ్రెండ్స్ తో కలిసి బస చేసింది. సదరు మహిళకు ఏం కావాలో చూసుకోవాలని హోటల్ సీనియర్ అధికారి కిందిస్థాయి సిబ్బందికి చెప్పాడు. అయితే ఆ మహిళ మాత్రం హోటల్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించింది.

విదేశీ మహిళ తన రూమ్ నుంచి నగ్నంగా బయటికి రావడంతో హోటల్ సిబ్బంది హడలిపోయారు. ఈక్రమంలోనే ఆమెకు నచ్చజెప్పేందుకు హోటల్ మేనేజర్ ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం హోటల్ సిబ్బందితో గొడవకు దిగింది. కోపంతో ఊగిపోతూ హోటల్ సిబ్బంది జట్టు పట్టుకొని లాగింది.

దీంతో ఆమె చేతిలో దెబ్బలుతిన్న సిబ్బంది ఆమెపై పోలీస్ స్టేషన్లో కేసు పెడుతామని బెదిరించారు. దీంతో భయపడిన సదరు మహిళ వెనక్కి తగ్గి తన రూములోకి వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంపై తమకు లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతుండటం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.