Begin typing your search above and press return to search.

హైవేపై రయ్ రయ్ అంటూ కారు నడిపిన ఐదేళ్ల కుర్రాడు ..ఆ తర్వాత ఏమందంటే ?

By:  Tupaki Desk   |   31 Jan 2021 6:00 AM IST
హైవేపై రయ్ రయ్ అంటూ కారు నడిపిన ఐదేళ్ల కుర్రాడు ..ఆ తర్వాత ఏమందంటే ?
X
వేలాది వాహనాలతో ప్రతిక్షణం రద్దీ రద్దీగా ఉండే హైవేపై ఐదేళ్ల బుడ్డోడు టయోటా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జెట్ స్పీడ్ తో కారును నడిపాడు. అంతేకాదు ఏ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద కూడా బాలుడు కారును ఆపలేదు. బాలుడు కారును నడుపుతున్నట్లు పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. ఈ షాకింగ్ ఘటన పాకిస్తాన్ ‌లో చోటు చేసుకుంది.

ఓ బిజీ హైవేపై ఐదేళ్ల బాలుడు ఏకంగా బ్లాక్‌ టొయోటా కారును నడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 27 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో చిన్నారి బ్లాక్‌ టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ వీ8ని నడిపిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన బోసన్‌ మీదుగా బాలుడు అత్యంత వేగంగా కారును నడిపాడు. అసలు ఆ బాలుడి పొడవెంత, అతని పాదం కనీసం పెడల్స్‌ ను టచ్‌ చేసిందా, అని ఈ వీడియోకు క్యాప్షన్‌ జతచేశారు. అలాగే ఆ సమయంలో బాలుడితో పాటు వాహనంలో ఎవరూ కనిపించలేదు.

పాకిస్తాన్‌ లో ఫుల్‌ బీజీగా ఉండే రోడ్డుపై ఐదేళ్ల బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి అతి వేగంగా కారు నడుపుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారులో పెద్దవారు ఎవరూ లేకపోవడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్‌కేజీ చదివే వయసులో చిన్నారి బ్లాక్‌ టయోటా కారును నడుపుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రాంక్‌ వీడియో అయినా సరే.. ఆ చిన్నారి తల్లితండ్రులను శిక్షించాలని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. వాహనం నడిపిన బాలుడి తల్లితండ్రులను గుర్తించేందుకు రెండు పోలీస్‌ బృందాలను నియమించామని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.